Anshul Kamboj : టీమిండియాకు గాయాల బెడద.. నాలుగో టెస్టుకు మరో కొత్త బౌలర్.. ఆ 5వికెట్లే అవకాశం తెచ్చాయా ?
అర్ష్‌దీప్ సింగ్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగే నాలుగో టెస్టు నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో అంశుల్ కంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా ఆడేది ఇంకా ఖరారు కాలేదు. దీంతో అంశుల్ కంబోజ్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభించే అవకాశం ఉంది.

Anshul Kamboj : ఇంగ్లాండ్‌తో మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం యువ పేస్ బౌలర్ అంశుల్ కంబోజ్‌కు టీమ్ ఇండియా నుంచి పిలుపు వచ్చింది. ప్రధాన పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు వేలికి గాయం కావడంతో నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. జూలై 23 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్‌లో జరగనున్న ఈ నాలుగో టెస్ట్ టీమ్ ఇండియాకు డూ ఆర్ డై మ్యాచ్. ఈ కీలక మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అంశుల్ కంబోజ్ అరంగేట్రం చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇంగ్లాండ్‌తో మిగిలిన రెండు టెస్టుల కోసం యువ పేసర్ అంశుల్ కంబోజ్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు. వేలికి గాయం కావడంతో అర్ష్‌దీప్ సింగ్ నాలుగో టెస్టు నుంచి తప్పుకున్నాడు. నాలుగో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్‌లో జరగనుంది. బీసీసీఐ వర్గాల ప్రకారం, అర్ష్‌దీప్ సింగ్ చేతికి లోతైన గాయం అయ్యిందని, కుట్లు కూడా వేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. అతను పూర్తిగా కోలుకోవడానికి కనీసం 10 రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో సెలక్టర్లు అంశుల్ కంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడతాడని ముందుగా నిర్ణయించారు. అతను ఇప్పటికే రెండు టెస్టులు ఆడాడు. ఇప్పుడు మిగిలిన రెండు టెస్టుల్లో ఒక టెస్టు మాత్రమే ఆడనున్నాడు. అతను నాలుగో టెస్టు కాకుండా ఐదవ టెస్టు ఆడాలని ముందుగా అనుకున్నారు. అయితే, ఇప్పుడు నాలుగో టెస్టు డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో బుమ్రా తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది.
ఒకవేళ బుమ్రా మాంచెస్టర్ టెస్టులో ఆడకపోతే, అంశుల్ కంబోజ్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభించవచ్చు. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ తొలి రెండు టెస్టుల్లో చాలా పరుగులు సమర్పించుకున్నాడు.. కాబట్టి అతను తిరిగి జట్టులోకి రావడం కష్టంగా కనిపిస్తోంది. అంశుల్ కంబోజ్ గత నెలలో ఇంగ్లాండ్‌లోనే ఉన్నాడు. అక్కడ ఇండియా ‘ఏ’ తరఫున ఇంగ్లాండ్ లయన్స్ తో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ మ్యాచ్‌ల్లో అతను మొత్తం 5 వికెట్లు తీసి, ఒక హాఫ్ సెంచరీ(51)తో సహా 76 పరుగులు కూడా చేశాడు.
అంశుల్ కంబోజ్ ఇప్పటివరకు ఏ ఫార్మాట్‌లోనూ టీమ్ ఇండియా తరఫున ఆడలేదు. అతను 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 41 ఇన్నింగ్స్‌లలో 79 వికెట్లు తీశాడు. ఇందులో ఒకసారి 10 వికెట్లు, రెండుసార్లు 5 వికెట్లు తీసిన రికార్డు ఉంది. బ్యాటింగ్‌లో కూడా అతను రాణించగలడు. 34 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లలో 16.20 సగటుతో 486 పరుగులు చేశాడు. వీటితో పాటు అంశుల్ కంబోజ్ 25 లిస్ట్ ‘ఏ’ మ్యాచ్‌లలో 40 వికెట్లు, 30 టీ20 మ్యాచ్‌లలో 34 వికెట్లు పడగొట్టాడు. అతను ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




