AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వికెట్ తీసిన ఆనందంలో సెలబ్రేషన్స్.. ఊహించని ప్రమాదం.. కట్‌చేస్తే.. భుజంపై మోసుకుంటూ వెళ్లిన సహచరులు

Yuvraj Khatri Video: స్పిన్నర్ యువరాజ్ 2 వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా తన జట్టుకు అవసరమైన విజయాన్ని అందించాడు. కానీ, దానిని సెలబ్రేట్ చేసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదంలో చిక్కుకున్నాడు. దీంతో మైదానం నుంచి ఎత్తుకుని తీసుకువెళ్లాల్సి వచ్చింది.

Video: వికెట్ తీసిన ఆనందంలో సెలబ్రేషన్స్.. ఊహించని ప్రమాదం.. కట్‌చేస్తే.. భుజంపై మోసుకుంటూ వెళ్లిన సహచరులు
Yuvraj Khatri Video
Venkata Chari
|

Updated on: Dec 02, 2024 | 6:52 PM

Share

మ్యాచ్ ఆడే సమయంలో ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. బ్యాటర్లే కాదు, బౌలర్లు, ఫీల్డర్లు ఇలా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక బౌలర్ల గురించి మాట్లాడితే.. తమ ఆనందాన్ని ఒక్కోక్కరు ఒక్కోలా వెల్లడిస్తుంటారు. వికెట్ తీసిన ఆనందంలో కొందరు చాలా దూరం పరుగెత్తుంటారు. మరికొందరు గట్టిగా అరుస్తుంటారు. కొందరు దూకుడుగా సంజ్ఞలు చేస్తుంటారు. మరికొందరు చప్పట్లు కొడుతుంటారు. ప్రతి బౌలర్ తన వికెట్‌ను వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. కానీ, నేపాల్ యువ బౌలర్ కూడా ఇలాంటి సంబరాలు చేసుకునేందుకు ప్లాన్ చేశాడు. కానీ, కథ అడ్డం తిరిగే సరికి మైదానం నుంచి మోసుకెళ్లాల్సి వచ్చింది. అండర్-19 ఆసియా కప్‌లో, నేపాల్ బౌలర్ యువరాజ్ ఖత్రీ వికెట్ తీసిన సంబరాల్లో మునిగిపోయాడు. ఆ ఆనందం వెంటనే, ప్రమాదం సంభవించింది. అతన్ని మైదానం నుంచి బయటకు తీయవలసి వచ్చిందన్నమాట.

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ఐదో మ్యాచ్‌లో బంగ్లాదేశ్, నేపాల్ అండర్-19 జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 141 పరుగులు మాత్రమే చేసింది. నేపాల్ ఓపెనర్ ఆకాష్ త్రిపాఠి అత్యధికంగా 43 పరుగులు చేశాడు. ఈ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కేవలం 29 ఓవర్లలోనే ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో పడిన 5 వికెట్లలో, స్పిన్నర్ యువరాజ్ ఖత్రీ 4 వికెట్లు తీయడం గమనార్హం. అయితే, వీటిలో ఒక వికెట్ అతనికి చాలా ఖరీదైనదిగా మారింది.

ఇవి కూడా చదవండి

వేడుకల స్ఫూర్తితో ప్రమాదం..

ఈ 17 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఇన్నింగ్స్ 28వ ఓవర్లో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నాడు. ముందుగా ఫరీద్ హసన్‌ను బౌల్డ్ చేసి షూ విప్పి ఫోన్‌లో మాట్లాడుతున్నట్లుగా చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాతి బంతికే కొత్త బ్యాట్స్‌మెన్‌ రిజాన్‌ హోసన్‌కు ఎల్‌బీడబ్ల్యూ అవుట్‌ చేసి పూర్తి ఉత్సాహంతో లాంగ్‌ రన్‌ చేశాడు. అప్పుడు అతను తన స్నేహితులతో సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించాడు. ఈ ఉత్సాహంలో అతని ఎడమ కాలు చీలమండ మెలితిరిగింది. దీంతో నొప్పితో మూలుగుతున్నాడు.

భుజం మీద మోసుకుంటూ..

ఇక్కడ యువరాజ్ నొప్పితో మూలుగుతూ మైదానంలో కూర్చున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, జట్టు ఫిజియో వెంటనే మైదానానికి వచ్చి అతన్ని పరీక్షించాడు. పరిస్థితి బాగాలేకపోవడంతో తోటి ఆటగాడిని పిలిచి యువరాజ్‌ని భుజంపై ఎత్తుకుని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం యువరాజ్ పరిస్థితిపై నేపాల్ జట్టు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నేపాల్ తదుపరి మ్యాచ్ మంగళవారం డిసెంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!