NED vs AFG Match Report: నెదర్లాండ్స్‌పై ఘన విజయం.. బాబర్ సేనకు భారీ షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్..
ICC World Cup Match Report, Netherlands vs Afghanistan, 34th Match: 2023 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ వరుసగా మూడో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 00 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ జట్టు 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. 180 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ICC World Cup Match Report, Netherlands vs Afghanistan, 34th Match: 2023 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ వరుసగా మూడో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ జట్టు 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. 180 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ విజయంతో ఆఫ్ఘనిస్థాన్ సెమీ ఫైనల్ రేసులో కొనసాగుతోంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి ఎగబాకింది. ఆఫ్ఘనిస్థాన్ బ్యాగ్‌లో 8 పాయింట్లు ఉన్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో, పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆఫ్ఘన్ జట్టులో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ 56 పరుగులతో హాఫ్ సెంచరీలు ఆడగా, రహమత్ షా 52 పరుగులతో అర్ధ సెంచరీలు ఆడారు. అంతకు ముందు మహ్మద్ నబీ 3 వికెట్లు తీశాడు.
View this post on Instagram
అంతకుముందు..
నెదర్లాండ్స్ టీం ఆఫ్ఘనిస్థాన్‌కు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 58 పరుగులతో అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రాణించలేకపోయారు. అఫ్గానిస్థాన్ తరపున మహ్మద్ నబీ 3 వికెట్లు, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్.
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కీపర్/కెప్టెన్), బాస్ డి లీడే, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.
View this post on Instagram
పాయింట్ల పట్టిక
| క్రమ సంఖ్య | జట్టు | ఆడింది | గెలిచింది | ఓడింది | N/R | టైడ్ | నెట్ రన్ రేట్ | పాయింట్లు |
|---|---|---|---|---|---|---|---|---|
| 1 | భారతదేశం |
7 | 7 | 0 | 0 | 0 | +2.102 | 14 |
| 2 | దక్షిణ ఆఫ్రికా |
7 | 6 | 1 | 0 | 0 | +2.290 | 12 |
| 3 | ఆస్ట్రేలియా |
6 | 4 | 2 | 0 | 0 | +0.970 | 8 |
| 4 | న్యూజిలాండ్ |
7 | 4 | 3 | 0 | 0 | +0.484 | 8 |
| 5 | ఆఫ్ఘనిస్తాన్ |
7 | 4 | 3 | 0 | 0 | -0.330 | 8 |
| 6 | పాకిస్తాన్ |
7 | 3 | 4 | 0 | 0 | -0.024 | 6 |
| 7 | శ్రీలంక |
7 | 2 | 5 | 0 | 0 | -1.162 | 4 |
| 8 | నెదర్లాండ్స్ |
7 | 2 | 5 | 0 | 0 | -1.398 | 4 |
| 9 | బంగ్లాదేశ్ |
7 | 1 | 6 | 0 | 0 | -1.446 | 2 |
| 10 | ఇంగ్లండ్ |
6 | 1 | 5 | 0 | 0 | -1.652 | 2 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..














