AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: తూచ్.! రోహిత్‌ను వదిలేదేలే.. మినీ వేలంలోకి ఆ ఇద్దరు తోపు ప్లేయర్స్.. ముంబై లిస్టు ఇదిగో

వచ్చే సీజన్‌కు ముంబై ఇండియన్స్ తమ జట్టును బలోపేతం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కోర్ టీమ్‌ను నిలుపుకుంటూనే, ఆక్షన్ స్లాట్‌లు పెంచుకోవడానికి దాదాపు 13 మంది రిప్లేస్‌మెంట్ ఆటగాళ్లను విడుదల చేయనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

IPL 2026: తూచ్.! రోహిత్‌ను వదిలేదేలే.. మినీ వేలంలోకి ఆ ఇద్దరు తోపు ప్లేయర్స్.. ముంబై లిస్టు ఇదిగో
Mumbai Indians 1
Ravi Kiran
|

Updated on: Nov 10, 2025 | 1:33 PM

Share

ఐపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ సన్నద్దమవుతోంది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందుకోసమే పలువురు కీలక ఆటగాళ్లకు ఉద్వాసన పలికేందుకు సిద్దమైంది. గత సీజన్‌లో ముంబై 14 మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి క్వాలిఫైయర్‌కు చేరుకుంది. అయినప్పటికీ మొదటి ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం MIకి బలమైన కోర్ టీమ్ ఉంది. అయితే జట్టులో చాలామంది ఆటగాళ్లు రిప్లేస్‌మెంట్‌లుగా చేరారు కాబట్టి.. వారిని తిరిగి వేలంలోకి పంపించే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. అంటే దాదాపుగా 13 మంది ఆటగాళ్లను వేలంలోకి విడుదల చేయనున్నారని టాక్.

ఆ లిస్టులో రిచర్డ్ గ్లీసన్, కార్బిన్ బాష్, ముజీబ్ ఉర్ రెహమాన్, చరిత్ అసలంక, జానీ బెయిర్ స్టో, కృష్ణన్ శ్రీజిత్, రాజ్ బావా, రీస్ టోప్లీ, లిజాడ్ విలియమ్స్, అల్లాహ్ గజన్ఫర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ రిలీజ్ లిస్టు పక్కాగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. MI ప్రధానంగా రిప్లేస్‌మెంట్, పేలవమైన ఆటతీరు కనబరిచిన ఆటగాళ్లపై వేటు వేసే ఛాన్స్ ఉంది. అలాగే ఆక్షన్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరించి.. పలు హార్డ్ హిట్టింగ్ బ్యాటర్లను కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇక అటు రోహిత్ శర్మ కూడా ముంబై నుంచి విడుదల కానున్నాడని టాక్ నడిచినా.. అదంతా వట్టి పుకార్లేనని యాజమాన్యం కొట్టి పారేసింది. రోహిత్ శర్మను రిలీజ్ చేయట్లేదని.. తమ జట్టులో రోహిత్ ఓ కీలక భాగమని స్పష్టం చేసింది.

Follow Us