IPL 2025: ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్ ఇదే.. రోహిత్ శర్మపై కీలక నిర్ణయం..

|

Oct 17, 2024 | 2:10 PM

Mumbai Indians Retention Update: ఐపీఎల్ మెగా వేలానికి రంగం సిద్ధమైంది. దీంతో ఇప్పటికే రిటెన్షన్, రిలీజ్ నియమాలు ప్రకటించారు. ఈమేరకు అన్ని జట్లు ఈనెల చివరిలోపు రిటైన్ చేసిన ప్లేయర్ల జాబితాను విడుదల చేయాలని కోరింది. దీంతో అన్ని ఫ్రాంచైజీలు అదే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మపై కీలక నిర్ణయం తసుకున్నట్లు తెలుస్తోంది.

IPL 2025: ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్ ఇదే.. రోహిత్ శర్మపై కీలక నిర్ణయం..
Rohit Sharma
Follow us on

Mumbai Indians Retention Update: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాబోయే సీజన్ మెగా వేలానికి ముందు, అన్ని జట్లు అక్టోబర్ 31 నాటికి రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేయాలి. ముంబై ఇండియన్స్ (MI) జట్టు గత సీజన్‌లో చాలా కష్టాల్లో పడిన సంగతి తెలిసిందే. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని 14 మ్యాచ్‌లలో 10 ఓడిపోయింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్‌ను కెప్టెన్‌గా చేయడం ఎంఐ అభిమానులకు నచ్చలేదు. ఈ సీజన్‌లో ఎంఐ రోహిత్‌ను రిటైన్ చేస్తుందా లేదా అతనిని వదులుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతుంది.

రోహిత్ శర్మతో సహా ఈ స్టార్లను ఎంఐ వద్దే..

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ముంబై తన మాజీ కెప్టెన్ రోహిత్‌ను కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. దీంతో పాటు ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా కొనసాగించనున్నారు. జట్టులో అత్యంత విశ్వసనీయమైన ఇద్దరు ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను కూడా కొనసాగించనున్నారు. ఈ నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు ఫ్రాంచైజీ రూ.61 కోట్లు వెచ్చించనుంది. దీంతో రిటైన్‌ చేసుకున్న ఏకైక విదేశీ ఆటగాడిగా టిమ్‌ డేవిడ్‌ నిలవనున్నాడు. ఈ విధంగా MI తన రూ. 75 కోట్లతో నలుగురు భారతీయ, ఒక విదేశీ ఆటగాడిని తన వద్ద ఉంచుకోగలదు.

వేలంలోకి ఇషాన్ కిషన్‌..

నివేదిక ప్రకారం, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను రిటైన్ చేయరు. అయితే, ఫ్రాంచైజీ అతన్ని తిరిగి వేలంలోకి తీసుకురావాలని యోచిస్తోంది. మెగా వేలం కారణంగా, ఇతర జట్లు కూడా ఇషాన్ కిషన్ వంటి బ్యాట్స్‌మెన్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నందున అతని పందెం ఖరీదైనది కావచ్చు. కిషన్ 2018 నుంచి ముంబై జట్టులో భాగమయ్యాడు. కానీ, ఇప్పటికీ అతన్ని రిటైన్ చేయలేదనే నివేదిక కొంచెం షాకింగ్‌గా ఉంది. 2022లో ముంబై ఇషాన్ కిషన్‌ను 15.25 కోట్ల రూపాయల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇషాన్ కిషన్ మళ్లీ వేలానికి వెళితే, అతనికి భారీ బిడ్ దక్కుతుంతా లేదా అనేది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..