MS Dhoni: గూగుల్​ మ్యాప్‌లో ఎంఎస్ ధోనీ సిక్సర్.. ఆనందంలో అభిమానులు!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొట్టిన ఓ సిక్సర్‌ ను గూగుల్ గుర్తించింది. ఈ మేరకు ఆయన అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు.

MS Dhoni: గూగుల్​ మ్యాప్‌లో ఎంఎస్ ధోనీ సిక్సర్.. ఆనందంలో అభిమానులు!
Dhoni Six On Google Map
Follow us

|

Updated on: Jun 17, 2021 | 7:16 PM

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొట్టిన ఓ సిక్సర్‌ ను గూగుల్ గుర్తించింది. ఈ మేరకు ఆయన అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. ఈ మేరకు గూగుల్ గుర్తించిన ప్రదేశాన్నిచూపిస్తూ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా స్టేడియంలో చెన్నై సూపర్ ​కింగ్స్-రాజస్థాన్ రాయల్స్​ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఇన్నింగ్స్ చివరలో కెప్టెన్ కూల్ వరుస సిక్సర్లు రెచ్చిపోయాడు. ఓ సిక్స్ స్టేడియం బయట పడింది. అయితే, స్టేడియం బయట పడిన ఈ బంతిని ఓ అభిమాని తీసుకుని వెళ్లిపోయాడు. ఇది కెమెరాల్లో రికార్డైంది. అయితే, ఆ ప్లేస్‌ను ధోనీ ఫ్యాన్స్ ‘ధోనీస్ సిక్స్‌’గా పేరు పెట్టి, గూగుల్ కి అభ్యర్థించారు. తాజాగా గూగుల్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ మిస్టర్ కూల్. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం కోవిడ్-19 కారణంగా ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడింది. దీంతో ధోనీ ఇంటికి వెళ్లిపోయాడు. కాగా, కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. ఇప్ప‌టికే ఐపీఎల్ లో 29 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మ‌రో 31 మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. కోవిడ్ తో భారత్‌లో ఐపీఎల్ సాధ్యం కాద‌ని భావించి, యూఏఈకి త‌ర‌లించింది బీసీసీఐ. యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ తిరిగి ప్రారంభించనుంది బీసీసీఐ. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న ప్లాన్ చేశారు. కాగా, ధోనీ ఐపీఎల్ లో ఇప్పటివరకు 211 మ్యాచులు ఆడి 4669 పరుగులు సాధించాడు.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

Also Read:

Rafael Nadal: ఫ్యాన్స్‌ కి షాకిచ్చిన రఫెల్‌ నాదల్‌.. ఒలింపిక్స్‌, వింబుల్డన్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన!

WTC Finals: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. జట్టులో ఇద్దరు స్పిన్నర్లు.!