ధోని రెండోసారి ఇలా…
ప్రపంచకప్‌లో భాగంగా సౌతాంఫ్టన్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో బౌలర్ మొహమ్మద్ షమీ హ్యాట్రిక్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ వరల్డ్‌కప్‌లో ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. ఇది ఇలా ఉండగా మహేంద్ర సింగ్ ధోని దాదాపు 121 మ్యాచ్‌ల తర్వాత.. ఈ మ్యాచ్‌లో స్టంప్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. వన్డే ఫార్మాట్‌లో ధోని ఇలా ఔటవడం ఇది రెండోసారి. రషీద్ […]
ప్రపంచకప్‌లో భాగంగా సౌతాంఫ్టన్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో బౌలర్ మొహమ్మద్ షమీ హ్యాట్రిక్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ వరల్డ్‌కప్‌లో ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. ఇది ఇలా ఉండగా మహేంద్ర సింగ్ ధోని దాదాపు 121 మ్యాచ్‌ల తర్వాత.. ఈ మ్యాచ్‌లో స్టంప్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. వన్డే ఫార్మాట్‌లో ధోని ఇలా ఔటవడం ఇది రెండోసారి. రషీద్ ఖాన్ వేసిన బంతిని ఎదుర్కోబోయే ముందుకొచ్చి స్టంప్ ఔటైన ధోని.. ఈ మ్యాచ్‌లో 28 పరుగులు మాత్రమే చేశాడు. కాగా 2011 ప్రపంచకప్‌లో విండీస్ పై ధోని తొలిసారి స్టంప్ ఔటయ్యాడు.