ఆరంభమే మనది..వరల్డ్ కప్ హిస్టరీలో హ్యాట్రిక్ వికెట్స్
పసికూన అనుకున్న అఫ్గానిస్తాన్ వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించినంత పని చేసింది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించిన అఫ్గాన్ ఫ్లేయర్స్ చివరి ఓవర్ వరకు భారత్‌ను బెంబేలెత్తించారు. ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ విజయం సాధించడం ఒక్కటే కాదు… చివరి ఓవర్లో మహ్మద్ షమీ హ్యాట్రిక్ సాధించడమూ టీమిండియా అభిమానులను మెస్మరైజ్ చేసింది. ఈ గణాంకాలతో షమీ క్రికెట్ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 32 ఏళ్ల క్రితం 1987 ప్రపంచకప్‌లో భారత్ […]
పసికూన అనుకున్న అఫ్గానిస్తాన్ వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించినంత పని చేసింది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించిన అఫ్గాన్ ఫ్లేయర్స్ చివరి ఓవర్ వరకు భారత్‌ను బెంబేలెత్తించారు. ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ విజయం సాధించడం ఒక్కటే కాదు… చివరి ఓవర్లో మహ్మద్ షమీ హ్యాట్రిక్ సాధించడమూ టీమిండియా అభిమానులను మెస్మరైజ్ చేసింది.
ఈ గణాంకాలతో షమీ క్రికెట్ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 32 ఏళ్ల క్రితం 1987 ప్రపంచకప్‌లో భారత్ ఆటగాడు చేతన్ శర్మ తొలిసారి హ్యాట్రిక్ సాధించగా మళ్లీ ఇన్నేళ్లకు షమీ ఆ ఫీట్ సాధించాడు.
క్రికెట్ ప్రపంచ కప్‌లో తొలి హ్యాట్రిక్ చేతన్ శర్మదే. అప్పటికి ఏ జట్టు బౌలర్ కూడా ప్రపంచ కప్‌లో ఇలాంటి ఫీట్ సాధించలేదు. నాగపూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో చేతన్ శర్మ బౌలింగ్‌కు కివీస్ బ్యాట్స్‌మన్ వరుసగా పెవిలియన్ చేరారు. శర్మ వేసిన ఒక ఓవర్లో కెన్ రూథర్‌ఫర్డ్, ఇయాన్ స్మిత్, ఇవెన్ చాట్‌ఫీల్డ్ వరుసగా అవుటయ్యారు. ముగ్గురూ క్లీన్ బౌల్డ్ అయ్యారు. దీంతో ప్రపంచకప్ క్రికెట్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది.