ఈ వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్… వీడియో
భారత్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా అద్బుత విజయం సాధించింది. అయితే ఈ గెలుపు కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 2019 ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో భారత బౌలర్ షమీ.. వరుసగా మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో షమీ సాధించిన హ్యాట్రిక్ వీడియోను క్రికెట్ అభిమానుల కోసం ఐసీసీ ట్విట్టర్‌లో పెట్టింది. ఈ […]
భారత్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా అద్బుత విజయం సాధించింది. అయితే ఈ గెలుపు కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 2019 ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో భారత బౌలర్ షమీ.. వరుసగా మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో షమీ సాధించిన హ్యాట్రిక్ వీడియోను క్రికెట్ అభిమానుల కోసం ఐసీసీ ట్విట్టర్‌లో పెట్టింది. ఈ వీడియోను అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కాగా, ప్రపంచకప్‌లో భారత్ తరపున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్ షమీ.. తొలిసారి 1987లో చేతన్ శర్మ న్యూజిలాండ్‌పై ఈ ఘనత సాధించాడు.
What a way to end it @MdShami11! ???
Nabi c Pandya b Shami Alam b Shami Ur Rahman b Shami
India take an absolute thriller by 11 runs.
Watch the winning (and hat-trick) moment here!#INDvAFG | #TeamIndia | #CWC19 pic.twitter.com/q9fYvcR56z
— ICC (@ICC) June 22, 2019