విండీస్‌పై కివీస్ విజయం!
వరల్డ్ కప్ లో భాగంగా మాంచెస్టర్ వేదికగా విండీస్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 291 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(148; 154 బంతుల్లో 14×4, 1×6), రాస్ టేలర్(69; 95 బంతుల్లో 7 ఫోర్లు) రాణించడంతో కివీస్ భారీ స్కోర్ చేయగలిగింది. అటు విండీస్ బౌలర్లలో కాట్రెల్ నాలుగు […]
వరల్డ్ కప్ లో భాగంగా మాంచెస్టర్ వేదికగా విండీస్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 291 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(148; 154 బంతుల్లో 14×4, 1×6), రాస్ టేలర్(69; 95 బంతుల్లో 7 ఫోర్లు) రాణించడంతో కివీస్ భారీ స్కోర్ చేయగలిగింది. అటు విండీస్ బౌలర్లలో కాట్రెల్ నాలుగు వికెట్లు తీయగా.. బ్రాత్‌వైట్ రెండు.. గేల్ ఒక్క వికెట్ పడగొట్టారు.
అనంతరం 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు 49 ఓవర్లకు 286 పరుగులు చేసి ఆలౌట్ అయింది. క్రిస్ గేల్ (87; 84 బంతుల్లో 8×4, 6×6), షిమ్రాన్ హెట్మియర్(54; 45 బంతుల్లో 8×4, 1×6), కార్లోస్ బ్రాత్‌వైట్ (101; 82 బంతుల్లో 9×4, 5×6) విండీస్ జట్టును విజయ తీరాలకు తీసుకువచ్చినా.. 49 ఓవర్ వేసిన నీశమ్ బౌలింగ్‌లో బౌండరీ లైన్ వద్ద బౌల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విండీస్ కథ ముగిసింది. ఈ మ్యాచ్ ఓటమితో కరీబియన్ జట్టు సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి.
You just have to see it to believe it!!! ?
An all or nothing catch in the deep by Trent Boult is the difference between winning and losing a @cricketworldcup classic.
What an incredible game of cricket! ❤#BACKTHEBLACKCAPS | #MenInMaroon #CWC19 pic.twitter.com/bRSz3429tf
— ICC (@ICC) June 22, 2019