MS Dhoni: ‘ఆ రాత్రి ధోని విపరీతంగా ఏడ్చాడు.. మా జీవితంలో చెన్నై సారథిని అలా చూడలేదు’: షాకిచ్చిన మాజీ ప్లేయర్లు..
Chennai Super Kings: రెండేళ్ల నిషేధం తర్వాత లీగ్‌లోకి పునరాగమనం చేసిన ధోని టీం, ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ని ఓడించి చరిత్రలో మూడోసారి టైటిల్‌ను CSKకి అందించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ చివరి దశకు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు ఈ సీజన్ ఊహించిన విధంగా కలిసొచ్చింది. ఎంఎస్ ధోని లీగ్‌లో చివరి సీజన్‌లో ‘ఎల్లో ఆర్మీ’ లీగ్‌లో ఆధిపత్యం చెలాయించింది. లీగ్ దశలో రెండవ స్థానంలో నిలిచింది.
CSKకి ఇప్పుడు ఫైనల్‌కు చేరుకోవడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. దీంతో రికార్డు స్థాయిలో ఐదవసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వాలిఫయర్‌లో మంగళవారం (మే 23) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ధోనీ నేతృత్వంలోని జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. ఒక విజయం ఫైనల్‌లో చెన్నై బెర్త్‌ను ఖాయం చేస్తుంది. అయితే ఓడిపోతే రెండో క్వాలిఫైయర్‌లో లక్నో సూపర్ జెయింట్ (LSG) లేదా ముంబై ఇండియన్స్ (MI)తో ఆడాల్సి ఉంటుంది.
CSK, మాజీ CSK ఆటగాళ్లకు చారిత్రాత్మకమైన మ్యాచ్‌కు ముందు హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్ 2018 ఐపీఎల్‌లో జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో ధోని ఏడ్చాడని పేర్నొన్నారు. దీంతో మునుపెన్నడూ వినని స్టోరీని బయటపెట్టారు. టైటిల్ గెలుచుకున్న సీజన్‌లో CSK శిబిరంలో భాగమైన హర్భజన్, తాహిర్ బెట్టింగ్ కుంభకోణం కారణంగా రెండేళ్ల నిషేధం తర్వాత CSK లీగ్‌కి తిరిగి రావడం తమను ఎలా భావోద్వేగానికి గురి చేసిందో వెల్లడించారు.




“నేను పంచుకోవాలనుకుంటున్న కథ ఒకటి ఉంది. 2018లో 2 సంవత్సరాల నిషేధం తర్వాత CSK ఈ లీగ్‌కి తిరిగి వచ్చింది. టీమ్ డిన్నర్ సమయం అంది. ‘పురుషులు ఏడవరు’ అనే సామెతను నేను విన్నాను. కానీ, ఎంఎస్ ధోని ఆ రాత్రి ఏడ్చాడు. అతను ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ విషయం ఎవరికీ తెలియదని నేను అనుకుంటున్నాను. నిజమే, ఇమ్రాన్ (తాహిర్)?” అని స్టార్ స్పోర్ట్స్‌లో హర్భజన్ చెప్పుకొచ్చాడు.
“అవును, నేను కూడా అక్కడే ఉన్నాను. అది అతనికి (ఎంఎస్ ధోని) చాలా ఎమోషనల్ మూమెంట్. అతనిని అలా చూస్తుంటే, ఈ జట్టు అతని హృదయానికి ఎంత దగ్గరగా ఉందో నాకు తెలిసింది. అతను జట్టును తన కుటుంబంలా భావిస్తాడు. ఇది మా అందరికీ చాలా భావోద్వేగంగా ఉంది.” “మేం 2 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాం. ట్రోఫీని గెలుచుకున్నాం. సోషల్ మీడియాలో వృద్ధుల టీం అనే ట్యాగ్‌ను ఇచ్చారు. నేను కూడా ఆ సీజన్‌లో జట్టులో ఉన్నాను. కానీ మేం టైటిల్‌ను గెలుచుకున్నాం. ఆ విజయానికి నేను చాలా గర్వపడుతున్నాను” అని తాహిర్ జోడించాడు.
2018లో చెన్నై పునరాగమనం సందర్భంగా, మెగా వేలంలో వృద్ధాప్య జట్టు కోసం భారీగా ఖర్చు చేశారని విపరీతమైన విమర్శలు గుప్పించారు. వారికి ‘డాడీస్ ఆర్మీ’ అనే మారుపేరు కూడా ఇచ్చారు. అయితే, 2018, 2021లో టైటిల్‌ను గెలుచుకోవడం, అలాగే 2019లో ఫైనల్‌లో ఓడిపోవడం ద్వారా ధోనీ & కో ప్రతి ఒక్కరినీ తప్పుగా నిరూపించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
