MS Dhoni Birthday: మిస్టర్ కూల్ ఈ 7 రికార్డులు బ్రేక్ చేయడం కష్టమే.. అవేంటో తెలుసా?
MS Dhoni Birthday: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈరోజు తన 43వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన ధోనీ ఇప్పటికీ క్రికెట్ మైదానంలో కొనసాగడం విశేషం. అంటే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ 43 ఏళ్ల ధోనీ ఐపీఎల్‌లో సందడి చేస్తున్నాడు.
MS Dhoni Birthday: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) 43వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. 1981 జులై 7న రాంచీలో జన్మించిన ధోనీ తన కెరీర్‌లో భారత్‌కు ఎన్నో ట్రోఫీలు అందించాడు. ధోనీ తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులను లిఖించాడు. ముఖ్యంగా నాయకుడిగా ప్రపంచంలో ఏ కెప్టెన్‌కు దక్కిన విజయాలు సాధించాడు. ఈ జెర్సీ నంబర్ 7తో లిఖించిన 7 అద్భుతమైన రికార్డులను ఓసారి చూద్దాం
హాఫ్ సెంచరీ రికార్డ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 5 విభిన్న బ్యాటింగ్ ఆర్డర్‌లలో హాఫ్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు ధోనీ. ధోనీ మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడో నంబర్లలో హాఫ్ సెంచరీలు చేసి ఈ రికార్డు సృష్టించాడు.
సెంచూరియన్: టీమిండియా తరపున మహేంద్ర సింగ్ ధోనీ 7వ ఆర్డర్‌లో రెండు సెంచరీలు సాధించాడు. ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ కూడా 7వ స్థానంలో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేయలేదు. కాబట్టి, ఈ రికార్డు అపూర్వమైన విజయంగా పరిగణిస్తున్నారు.
బెస్ట్ ఫినిషర్: ఐపీఎల్‌లో 229 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోనీ చివరి ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. అంటే మొత్తం మ్యాచ్‌ల చివరి ఓవర్లలో సీఎస్‌కే కెప్టెన్ సరిగ్గా 667 పరుగులు చేశాడు.
కెప్టెన్ కూల్: 200 వన్డేలు, 70 టెస్టులు, 72 టీ20లతో సహా మొత్తం 332 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ధోనీ నాయకత్వం వహించాడు. దీని ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కనిపించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఉత్తమ వికెట్ కీపర్: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్‌గా కూడా ధోనీ రికార్డు సృష్టించాడు. CSK కెప్టెన్ ధోని 148 క్యాచ్ అవుట్లు, 42 స్టంపింగ్‌లతో 190 మంది ఆటగాళ్లను పెవిలియన్‌కు చేర్చాడు.
తిరుగులేని ధోని: ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్‌గా నిలిచిన మహేంద్ర సింగ్ ధోని వన్డేల్లో 84 సార్లు అజేయంగా నిలిచాడు. ఇది కూడా ప్రపంచ రికార్డు.
కెప్టెన్ రికార్డ్: అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ రికార్డును కూడా కలిగి ఉన్నాడు. భారత్‌కు తొలి టీ20 ప్రపంచకప్ (2007), రెండో వన్డే ప్రపంచకప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) గెలుచుకోవడం ద్వారా ధోనీ ఈ గొప్ప ఫీట్ సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..