IPL 2023: ‘పవర్‌ప్లే కింగ్’ దెబ్బకు రికార్డులు గల్లంతు.. అగ్రస్థానంతో అందనంత దూరం.. ఎవరంటే?
Mohammed Shami: గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఐపీఎల్ 2023లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మే 15న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు.

Mohammed Shami In IPL 2023: గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఐపీఎల్ 2023లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మే 15న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో షమీ పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానానికి చేరాడు. మరోవైపు ఐపీఎల్ 16లో ఇప్పటివరకు పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు.
ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో షమీ 14 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో బెంగళూరు బౌలర్ సిరాజ్, రాజస్థాన్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ తలో 9 వికెట్లతో వరుసగా రెండు, మూడవ స్థానంలో ఉన్నారు. షమీ ఈ లెక్కలు చూస్తే ‘పవర్‌ప్లే కింగ్’ అని పిలవొచ్చు. పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ఈ జాబితాలో దీపక్ చాహర్, మార్కో జాన్సెన్ తలో 7 వికెట్లతో వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నారు.
IPL 2023 పవర్‌ప్లేలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్స్..
మహ్మద్ షమీ (గుజరాత్ టైటాన్స్) – 14 వికెట్లు.




మహ్మద్ సిరాజ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 9 వికెట్లు.
ట్రెంట్ బౌల్ట్ (రాజస్థాన్ రాయల్స్) – 9 వికెట్లు.
దీపక్ చాహర్ (చెన్నై సూపర్ కింగ్స్) – 7 వికెట్లు.
మార్కో జాన్సెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 7 వికెట్లు.
ఐపీఎల్ 2023లో 2సార్లు నాలుగు వికెట్లు..
ఐపీఎల్ 2023లో మహమ్మద్ షమీ వికెట్ల పరంపర కొనసాగుతోంది. సీజన్‌లో అతను అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్‌లో షమీ 13 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను బౌలింగ్‌లో 16.74 సగటుతో 23 వికెట్లు తీశాడు. ఈ సమయంలో, షమీ ఎకానమీ రేటు 7.55గా ఉంది. అదే సమయంలో షమీ ఈ సీజన్‌లో రెండుసార్లు నాలుగు వికెట్లు (ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు) కూడా పడగొట్టాడు.
షమీ IPL కెరీర్ గురించి మాట్లాడితే.. ఇప్పటివరకు 106 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 26.84 సగటుతో 122 వికెట్లు తీశాడు. ఈ సమయంలో షమీ ఎకానమీ రేటు 8.39గా ఉంది. షమీ 2013లో కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి 2013లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..