AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mitchell Starc: వీడు మగాడ్రా బుజ్జి.. 42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్

Mitchell Starc: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో అదరగొట్టాడు. కేవలం 22 బంతుల్లోనే 5 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు సృష్టించాడు. 440 టెస్ట్ వికెట్లతో డేల్ స్టెయిన్‌ను అధిగమించిన స్టార్క్, ఆస్ట్రేలియా తరఫున మరో చారిత్రాత్మక ఘనతను అందుకున్నాడు. తొలి టెస్టు ఓటమికి బంగ్లాదేశ్‌పై అదిరిపోయే ప్రతీకారం తీర్చుకున్నాడు.

Mitchell Starc: వీడు మగాడ్రా బుజ్జి.. 42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
Mitchell Starc
Rakesh
|

Updated on: Aug 22, 2026 | 8:13 AM

Share

Mitchell Starc: ఆస్ట్రేలియా పర్యటనలో బంగ్లాదేశ్ బ్యాటర్లకు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ చుక్కలు చూపించాడు. రెండో టెస్టులో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విరుచుకుపడిన స్టార్క్, కేవలం 22 బంతుల వ్యవధిలోనే 5 వికెట్లు నేలకూల్చి బంగ్లాదేశ్ బ్యాటింగ్ వెన్నుముకను విరిచేశాడు. ఆస్ట్రేలియాలోని మకాయ్ మైదానం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కంగారూ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. షార్ప్ స్వింగ్, మైండ్ బ్లాకింగ్ పేస్‌తో దాడి ప్రారంభించిన మిచెల్ స్టార్క్, బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్‌ను ప్లాటినమ్ డక్ రూపంలో పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్లో వరుస బంతుల్లో తంజీద్ హసన్, కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటోలను ఖాతా తెరవకుండానే అవుట్ చేసి మ్యాచ్‌ను పూర్తిగా ఆస్ట్రేలియా వైపు తిప్పేశాడు.

22 బంతుల్లోనే 5 వికెట్ల అరుదైన రికార్డు

స్టార్క్ వేగానికి బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ వద్ద ఎటువంటి సమాధానం లేకుండా పోయింది. ఐదో ఓవర్లో మోమినుల్ హక్ (9)ను అవుట్ చేసిన స్టార్క్, ఏడో ఓవర్లో లిటన్ దాస్‌ను సున్నాకే పెవిలియన్ చేర్చాడు. దీంతో కేవలం 42 నిమిషాల వ్యవధిలో వేసిన 22 బంతుల్లోనే 5 వికెట్లు పడగొట్టి తన కెరీర్‌లో మరో అద్భుతమైన రికార్డు నమోదు చేశాడు. మొదటి స్పెల్‌లో 6 ఓవర్లు వేసిన స్టార్క్ 4 మెయిడిన్లతో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. అతడు తీసిన 5 వికెట్లలో నలుగురు బ్యాటర్లు పరుగుల ఖాతా తెరిచే అవకాశం కూడా లేకపోయింది.

ఇది కూడా చదవండి: Cricket Records: 39 మ్యాచులు, 12 సెంచరీలు, 2541 పరుగులు.. 25 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు

డేల్ స్టెయిన్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు

ఈ సంచలన ప్రదర్శనతో మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సరికొత్త ఎత్తుకు ఎదిగాడు. సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ సాధించిన 439 వికెట్ల రికార్డును దాటేసి, తన ఖాతాలో 440 వికెట్లు జమ చేసుకున్నాడు. ఈ ఘనతతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచ టాప్-10 బౌలర్ల జాబితాలో స్టార్క్ స్థానం సంపాదించాడు. షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్, నాథన్ లయన్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియా బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఇది కూడా చదవండి: Love Affairs: ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.. పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ భామల అఫైర్లు

మొదటి టెస్టు ఓటమికి ప్రతీకారం

తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టుకు, ఈ మ్యాచ్‌లో స్టార్క్ ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. మొదటి టెస్టు పరాభవానికి ప్రతికారంగా ఆసీస్ బౌలర్లు మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం చెలాయించారు. స్టార్క్ విసిరిన యార్కర్లు, స్వింగర్లకు బంగ్లా బ్యాటర్లు క్రీజులో నిలబడలేక వరుసగా వికెట్లు పారేసుకున్నారు. మిచెల్ స్టార్క్ నమోదు చేసిన ఈ విధ్వంసకర స్పెల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతుంది. ప్రపంచ అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా తన స్థానాన్ని మరోసారి బలంగా చాటుకుంటూ ఆస్ట్రేలియాకు మ్యాచ్‌పై పూర్తి పట్టును అందించాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?