MI vs KKR Playing XI: టాస్ గెలిచిన ముంబై.. 14 ఏళ్ల కల నిజం చేసే ప్లేయింగ్ 11 ఇదే..
IPL Mumbai Indians vs Kolkata Knight Riders Playing XI: వాంఖడే పిచ్ సాధారణంగా బౌలర్ల కంటే బ్యాట్స్‌మెన్‌లకే ఎక్కువగా అనుకూలిస్తుంది. ఇక్కడ తరచుగా అధిక స్కోరు నమోదయ్యే మ్యాచ్‌లు కనిపిస్తాయి. మంచి స్వింగ్, బౌన్స్ లభించడం వల్ల, ముఖ్యంగా కొత్త బంతితో ఈ వికెట్‌పై పేసర్లకు కూడా సహకారం లభిస్తుంది.

IPL Mumbai Indians vs Kolkata Knight Riders Playing XI: ముంబై ఇండియన్స్ 300 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన తొలి ఫ్రాంచైజీగా నిలిచింది. ఈ సీజన్‌లోని రెండో మ్యాచ్ వాంఖడే స్టేడియంలో ముంబై, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్ కత్తా టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ముంబై ఇండియన్స్ టీం ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది (2013, 2015, 2017, 2019, 2020). గత ఐదు సీజన్లలో టైటిల్ గెలవలేదు. మరోవైపు, కోల్ కతా టీం 2012, 2014, 2024లో టైటిల్ గెలుచుకుంది. కానీ, గత సీజన్‌లో అంతగా ఆకట్టుకోలేక 8వ స్థానంలో నిలిచింది.
వాంఖడేలో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కోల్‌కతా..
కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌కు బలమైన రికార్డు ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన 35 మ్యాచ్‌లలో, ఎంఐ 24 గెలవగా, కేకేఆర్ 11 గెలిచింది. వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్లు 12 సార్లు తలపడ్డాయి. ఆతిథ్య జట్టు ముంబై ఆ మ్యాచ్‌లలో 10 గెలవగా, కోల్‌కతా కేవలం రెండు మాత్రమే గెలిచింది.
ఇరుజట్లు:
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ఏఎం ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
