AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: 5 ఏళ్ల తర్వాత బంగారం ధర ఎంత ఉంటుందో తెలుసా..? కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి..

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. అందరి కళ్లు ఇప్పుడు బంగారం ధరల పైనే ఉన్నాయి. అసలు 2030 నాటికి బంగారం ధర రూ. 2 లక్షలు దాటుతుందా? ఫండ్స్ ఇండియా సీఈఓ అక్షయ్ సప్రూ విశ్లేషణ ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో బంగారం ఇచ్చే రిటర్న్స్ ఎలా ఉండబోతున్నాయి? వెండిలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు సురక్షితమేనా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Gold: 5 ఏళ్ల తర్వాత బంగారం ధర ఎంత ఉంటుందో తెలుసా..? కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి..
Gold To Touch Rs 2.25 Lakh By 2030
Krishna S
|

Updated on: Mar 29, 2026 | 6:39 PM

Share

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సామాన్యుడి నుండి సంపన్నుల వరకు అందరి దృష్టి బంగారం పైనే ఉంది. ఈ తరుణంలో ఫండ్స్ ఇండియా సీఈఓ అక్షయ్ సప్రూ.. భారతీయ పెట్టుబడి ధోరణుల్లో వస్తున్న కీలక మార్పులను, బంగారం భవిష్యత్తును విశ్లేషించారు. పెట్టుబడిదారులు ఇప్పుడు పాత పద్ధతులను వదిలి కొత్త దారిలో వెళ్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక పరిణామాలను బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్న వివరాలు విస్తుగొలుపుతున్నాయి. 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1,68,000 నుండి రూ.2,25,000 కు చేరే అవకాశం ఉంది. సెంట్రల్ బ్యాంకుల బంగారు కొనుగోళ్లు, కరెన్సీ అస్థిరత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణం ధరలను రెక్కలు తొడిగిస్తున్నాయి. 2026 నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు సుమారు రూ.1,48,000 – రూ.1,50,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

బంగారం విజృంభణ ముగిసిందా?

అక్షయ్ సప్రూ విశ్లేషణ ప్రకారం.. గడిచిన కొన్నేళ్లుగా బంగారం ఇచ్చినంత భారీ రాబడిని రాబోయే ఐదేళ్లలో ఇవ్వకపోవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే 5 నుండి 10 శాతం బంగారం ఉంటే, దానిని మార్చాల్సిన అవసరం లేదు. కొత్తగా పెట్టుబడి పెట్టేవారు భారీ మొత్తంలో కాకుండా SIP ద్వారా దశలవారీగా బంగారం కొనుగోలు చేయడం ఉత్తమం. ఇక వెండి విషయానికొస్తే.. దాని ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయని, సాధారణ పెట్టుబడిదారులు దానికి దూరంగా ఉండటమే మేలని ఆయన సలహా ఇచ్చారు.

మారుతున్న పెట్టుబడిదారుల ఆలోచనః

గతంలో మార్కెట్ కుప్పకూలితే భయపడి వెనక్కి తగ్గే పెట్టుబడిదారులు, ఇప్పుడు మరింత స్పృహతో ఆలోచిస్తున్నారని సప్రూ తెలిపారు.  మెట్రో సిటీల నుండే కాకుండా చిన్న నగరాల నుండి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. మార్కెట్ పడిపోయినప్పుడు ఆందోళన చెందకుండా కొత్త SIP రిజిస్ట్రేషన్లు పెరుగుతుండటం దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం.

స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్:

రిస్క్ తగ్గించుకుని లాభాలు పొందడానికి డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ సూత్రాన్ని పాటించాలని సప్రూ సూచించారు. మీ వయస్సు 30 ఏళ్లు అయితే మీ డబ్బులో 70శాతం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఒకే రంగంపై ఆధారపడకుండా విభిన్న రంగాలలో పెట్టుబడులను విస్తరించడం ద్వారా నష్ట భయాన్ని తగ్గించుకోవచ్చు. భౌగోళిక ఉద్రిక్తతలు మన అదుపులో లేవు, కానీ మన పెట్టుబడి మన అదుపులో ఉండాలి. మార్కెట్ పడిపోయినప్పుడు మంచి కంపెనీల షేర్లను తక్కువ ధరకు కొనే అవకాశంగా భావించాలే తప్ప ఆందోళనతో వెనక్కి తగ్గకూడదు.

Follow Us