SA20: ఐపీఎల్‌లో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో తుఫాన్ సెంచరీ.. 200లకుపైగా స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత..
Joburg Super Kings vs MI Cape Town, SA20 League: ఈ మ్యాచ్‌లో ఎంఐ కేప్ టౌన్ టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసి, ఇద్దరు ఓపెనర్ల భీభత్సమైన బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. దీంతో జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంటే తొలి వికెట్‌కు ఓపెనర్లు ఇద్దరు 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Joburg Super Kings vs MI Cape Town: SA20 లీగ్‌లో మొదటి డబుల్-హెడర్ ఈ శనివారం జరుగుతోంది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగే డబుల్‌హెడర్ మొదటి గేమ్‌లో జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ ఎంఐ కేప్ టౌన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్ టౌన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. దీంతో జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఎంఐ కేప్ టౌన్ జట్టులో ఓపెనర్లుగా వచ్చిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్ ఆరంభం నుంచే తుఫాన్ బ్యాటింగ్ చేశారు. దీంతో కేవలం 15.3 ఓవర్లలోనే 200 పరుగులు చేశాడు. ఈసారి రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. దీంతో ఎంఐ కేప్ టౌన్ జట్టు తొలి వికెట్ పడింది.
అలాగే, మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కూడా మెరుపు బ్యాటింగ్ ఆడి కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 పరుగులు చేశాడు. కానీ, కేవలం 2 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు.
Incredible!#JSKvMICT #Betway #SA20 pic.twitter.com/BpOt3JO5Xq
— Betway SA20 (@SA20_League) January 13, 2024
జోబర్గ్ సూపర్ కింగ్స్: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, రోనన్ హెర్మన్, లూయిస్ డు ప్లూయ్, మొయిన్ అలీ, డోనోవన్ ఫెరీరా, రొమారియో షెపర్డ్, నాండ్రే బెర్గర్, లిజాద్ విలియమ్స్, జహీర్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్.
What a display from Ryan Rickelton for @MICapeTown this afternoon.#Betway #SA20 #WelcomeToIncredible #JSKvMICT pic.twitter.com/mKgUUN6GvS
— Betway SA20 (@SA20_League) January 13, 2024
ఎంఐ కేప్ టౌన్: రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రూయిస్, కోనార్ ఎస్టర్‌హ్యూజెన్, లియామ్ లివింగ్‌స్టోన్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), సామ్ కుర్రాన్, జార్జ్ లిండే, కగిసో రబడా, బురాన్ హెండ్రిక్స్, ఒల్లీ స్టోన్.
Record: Highest partnership in the #Betway #SA20#JSKvMICT #WelcomeToIncredible pic.twitter.com/vudUmA5i1a
— Betway SA20 (@SA20_League) January 13, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
