AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: టాస్ గెలిచినోడే ఇండోర్‌లో బాస్.. టీమిండియా రికార్డులు చూస్తే ఆఫ్ఘానోళ్లకు దడ పుట్టాల్సిందే..

India vs Afghanistan, Holkar Cricket Stadium Pitch Report: ఈ మైదానంలో టీమ్ ఇండియా ఇప్పటివరకు 7 వన్డేలు ఆడింది. అన్ని మ్యాచ్‌లను గెలుచుకుంది. అయితే, కేవలం 1 టీ20, 1 టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం సాధించాలని భావిస్తోంది. ఇండోర్ టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ టీమ్ ఉవ్విళ్లూరుతోంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. సరిహద్దు కూడా చిన్నదిగా ఉంటుంది. ఈ కారణంగానే బ్యాట్స్‌మెన్‌కి బౌండరీలు, సిక్సర్లు బాదడం ఈజీగా ఉంటుంది.

IND vs AFG: టాస్ గెలిచినోడే ఇండోర్‌లో బాస్.. టీమిండియా రికార్డులు చూస్తే ఆఫ్ఘానోళ్లకు దడ పుట్టాల్సిందే..
Holkar Stadium Ind Vs Afg
Venkata Chari
|

Updated on: Jan 13, 2024 | 9:20 PM

Share

IND vs AFG: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం(Holkar Stadium in Indore) లో రేపు అంటే ఆదివారం భారత్, ఆఫ్ఘనిస్థాన్ (India vs Afghanistan) మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా(Team India) విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండోర్ టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ టీమ్ ఉవ్విళ్లూరుతోంది. దానికి తోడు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఎందుకంటే ఈ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 7 వన్డేలు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది. కేవలం 1 టీ20, 1 టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం సాధించాలని భావిస్తోంది.

పిచ్ ఎవరికి ఉపయోగపడుతుంది?

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. సరిహద్దు కూడా చిన్నదిగా ఉంటుంది. ఈ కారణంగానే బ్యాట్స్‌మెన్‌కి బౌండరీలు, సిక్సర్లు బాదడం ఈజీగా ఉంటుంది. ఈ పిచ్‌పై సగటు టీ20 స్కోరు 210 పరుగులు. అందువల్ల టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటి వరకు రెండు టీ20 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా గెలుపొందగా, రన్ ఛేజింగ్ టీమ్ ఒకసారి గెలిచింది.

టాస్ కీలక పాత్ర..

భారత్-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇండోర్‌లో రాత్రి ఉష్ణోగ్రత పడిపోతుంది. రాత్రి పెరిగే కొద్దీ మంచు దానిపై ప్రభావం చూపుతుంది. ఇటువంటి పరిస్థితిలో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడవచ్చు.

చివరి టీ20లో భారత్‌కు ఓటమి..

ఈ మైదానంలో చివరిసారిగా 2022 అక్టోబర్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 227 పరుగులు చేసింది. అనంతరం భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రిలే రస్సో కేవలం 48 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. మొత్తం మ్యాచ్‌లో 29 సిక్సర్లు నమోదయ్యాయి.

రోహిత్ ఫాస్టెస్ట్ సెంచరీ..

రోహిత్ శర్మకు ఈ మైదానం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, ఇండోర్‌లో భారత్ తరపున రోహిత్ టీ20లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. 2017లో హోల్కర్ స్టేడియంలో శ్రీలంకపై రోహిత్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 43 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 118 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..