AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యాచ్ గెలిచినా.. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఓటమే.. క్రికెట్ చట్టాల్లో భారీ మార్పులు చేసిన ఎంసీసీ.. అమలయ్యేది ఎప్పుడంటే?

ఒక జట్టు చివరి బంతికి మ్యాచ్ గెలిచిన ఆనందంలో క్రికెట్ నియమాల ఉల్లంఘన జరిగితే.. మ్యాచ్ ఫలితం తారుమారు అవ్వొచ్చు. అంటే, గెలిచన జట్టు ఓడిపోవచ్చు. ఎందుకంటే, క్రికెట్ రూల్ బుక్ లో కొత్త నియమాలు చోటుచేసుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మ్యాచ్ గెలిచినా.. ఈ రూల్ బ్రేక్ చేస్తే ఓటమే.. క్రికెట్ చట్టాల్లో భారీ మార్పులు చేసిన ఎంసీసీ.. అమలయ్యేది ఎప్పుడంటే?
Mcc Rules
Venkata Chari
|

Updated on: Feb 04, 2026 | 7:10 AM

Share

క్రికెట్‌లో మరికొన్ని రూల్స్ చేరబోతున్నాయి. వీటితో క్రికెట్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఈమేరకు మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (MCC) భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. 73 కొత్త నియమాలను తీసుకరావాలంటూ ప్రతిపాదనలు చేసింది. ఆధునిక కాలానాకి అనుగుణంగా క్రికెట్ లో ఫార్మాట్ మేరకు మరింత ఉత్కంఠతను తీసుకొస్తుందని చెబుతోంది. ఈ కొత్త నియమాలు అక్టోబర్ 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో ఓ నియమం ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కొత్త నియమం మేరకు ఆ రోజు లాస్ట్ ఓవర్ లో వికెట్‌ పడితే ఆటను అక్కడితో ముగిస్తుంటారు. కానీ, ఈ సంప్రదాయానికి మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ గుడ్ బై చెప్పింది. వికెట్‌ పడ్డా సవరించిన చట్టం 12.5.2 ప్రకారం ఆ ఓవర్ లో మిగిలిన బంతులను ఖచ్చితంగా సంధించాల్సిందేనని తెలిపింది. కాగా, ఈ కొత్త నియమం బౌలర్లకు గుడ్ న్యూస్ లా పనిచేస్తుంది. కొత్త బ్యాటర్లకు మాత్రం ఇది ఒక పీడకలగా మారనుంది.

మరో కీలక మార్పు గురించి మాట్లాడితే.. ప్రస్తుతం బ్యాట్ల ధరలు విపరీతంగా పెరగడంతో ‘ల్యామినేటెడ్‌ బ్యాట్ల’ను వాడుకోవచ్చని తెలిపింది. దీంతో క్రికెటర్లపై భారం పడకుండా ఉంటుందని ప్రకటించింది. అంతర్జాతీయ మ్యాచ్ లకు మాత్రం ఈ నియమం వర్తించకపోవచ్చు. పెనాల్టీల విషయంలోనూ కొన్ని నియమాలను చేర్చింది. ముఖ్యంగా బౌలర్‌ బంతిని సంధించిన తర్వాత వికెట్ కీపర్‌ స్టంప్స్‌ వెను తప్పక ఉండాలని తెలిపింది.

పెనాల్టీ రూల్స్ లో మార్పులు..

ఎంసీసీ జాబితాలో “పెనాల్టీ పరుగుల” నిబంధన కూడా ఉంది. మ్యాచ్ సమయంలో పెనాల్టీ పరుగులకు సంబంధించిన 41.17.2 నియమంలో ఓ కీలక మార్పు చేసింది. దీని ప్రకారం, ఒక మ్యాచ్ ఫలితం నిర్ణయమైనా.. అంపైర్లు మైదానం నుంచి నిష్క్రమించే ముందు ఏ జట్టైనా సదరు చట్టాన్ని ఉల్లంఘిస్తే, అంపైర్లు ఆ జట్టుపై పెనాల్టీ పరుగులు ఇవ్వవచ్చు. దీని ప్రకారం ఒక బ్యాట్స్‌మన్ తన జట్టుకు విజయాన్ని అందించేందుకు మ్యాచ్ చివరి బంతికి పరుగు తీసి, గెలుపును సెలబ్రేట్ చేసుకుంటుంటాడు. ఆ సమయంలో బౌలర్ ని ఉద్యేశించిన ఏవైన సైగలు చేస్తే.. సదరు జట్టుకు పెనాల్టీ పరుగులు ఇస్తారు, దీంతో ఆ మ్యాచ్‌ ఫలితం మారిపోతుందన్నమాట. ఒక మ్యాచ్ చివరి బంతికి ముందే ముగిసిందనుకుందాం.. ఈ సమయంలో గెలిచిన జట్టు పెనాల్టీ అందుకుంటే, ఫలితం మారిపోతుంది. ఉదాహరణకు, 49వ ఓవర్‌లో ఒక జట్టు గెలిచినా, పెనాల్టీ కారణంగా ఫలితం తారుమారు అయితే, ఆట అక్కడి నుంచి కొనసాగుతుందన్నమాట.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి