AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Statue: వివాదాస్పదంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ విగ్రహం.. బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్..

రెండు రోజుల క్రితం భారత మాజీ దిగ్గజ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమం ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్, బీసీసీఐ కార్యదర్శి జే షా, సచిన్ కుటుంబ సభ్యులు, వందలాది మంది క్రికెట్ అభిమానులు విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు.

Sachin Statue: వివాదాస్పదంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ విగ్రహం.. బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్..
Sachin Statue
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Nov 04, 2023 | 8:35 AM

Share

Sachin Statue: క్రికెట్ అనగానే.. మొదటగా అందరికి గుర్తొచ్చేది మాస్టర్ బ్లాస్టర్ సచిన్.. కొన్ని కోట్ల మంది అభిమానులు ఆయన సొంతం. సచిన్‌కు క్రికెట్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది..క్రికెట్ ఆటలో అతని స్టైల్ ఏ వేరు. ఇప్పటికీ ఆ స్టైల్‌ను చాలామంది క్రికెటర్ ఫాన్స్ ఫాలో అవుతూ ఉంటారు. సచిన్‌ను చూసి ఎంతోమంది ఇన్స్పిరేషన్‌గా తీసుకొని.. ఇటువైపు వచ్చిన వారెందరో ఉన్నారు. టీం కష్ట కాలంలో ఉన్నప్పుడు తన బ్యాట్‌తో.. ఒక్కసారి గ్రౌండ్లోకి దిగిన తర్వాత ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేవాడు. ఒకానొక దశలో అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగులు చేసి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు సచిన్. ఈ విధంగా అతనికి సాటి ఎవరూ లేరు అనే విధంగా ఎన్నో గొప్ప గొప్ప మ్యాచ్ లను ఆడి ఇండియాకు ఘన విజయాలను అందించాడు. అలాంటి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ భారతీయులంతా క్రికెట్ దేవుడిగా అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి క్రికెట్ దిగ్గజానికి క్రికెట్ దేవుడికి విగ్రహావిష్కరణ చేసింది బీసీసీఐ. ఇప్పుడు ఆ విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదమవుతోంది.

రెండు రోజుల క్రితం భారత మాజీ దిగ్గజ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమం ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్, బీసీసీఐ కార్యదర్శి జే షా, సచిన్ కుటుంబ సభ్యులు, వందలాది మంది క్రికెట్ అభిమానులు విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇంత ఘనంగా జరిగిన క్రికెట్ దేవుడు సచిన్ విగ్రహావిష్కరణ చివరకు పెద్ద ఎత్తున వివాదాస్పదమవుతోంది. విగ్రహం సచిన్‌ది కాదంటూ.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ విగ్రహం పెట్టారని విపరీతమైన ట్రోల్స్, విధాస్పద వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. సచిన్ పేరు చెప్పి ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ విగ్రహం పెట్టారంటూ తీవ్రంగా అభిమానులు ఆరోపిస్తున్నారు. వీరి మాటల్లో వాస్తవం లేకపోలేదు. విగ్రహాన్ని కాస్త పరిశీలించి చూస్తే అచ్చం స్టేప్ స్మిత్ ముఖాన్ని పోలినట్లుగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఇద్దరి ముఖ కవలికలతో పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నారు. కోట్లాదిమంది అభిమానులను సైతం తనవైపే చూసేలా మైదానంలోకి దిగి ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారు. అలాంటి మాస్టర్ బ్లాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అంటూ అభిమానులు మండిపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..