AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేం బౌలింగ్ అక్కా.! నీ స్వింగ్ చూస్తే దెబ్బకు ప్రత్యర్ధులు కంగుతినాల్సిందే..

అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజ బౌలర్లు చాలామందే ఉన్నారు. అయితేనేం స్వింగ్ కింగ్‌లు మాత్రం చాలా తక్కువ. ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్‌లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించే బౌలర్లు చాలా అరుదు. మెక్‌గ్రాత్, వసీం అక్రమ్.. మన టీమిండియాకు వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్..

Viral Video: ఇదేం బౌలింగ్ అక్కా.! నీ స్వింగ్ చూస్తే దెబ్బకు ప్రత్యర్ధులు కంగుతినాల్సిందే..
Cricket Video
Ravi Kiran
|

Updated on: Feb 10, 2024 | 1:03 PM

Share

అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజ బౌలర్లు చాలామందే ఉన్నారు. అయితేనేం స్వింగ్ కింగ్‌లు మాత్రం చాలా తక్కువ. ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్‌లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించే బౌలర్లు చాలా అరుదు. మెక్‌గ్రాత్, వసీం అక్రమ్.. మన టీమిండియాకు వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్.. ఇలా స్వింగ్ కింగులను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌ను కంగుతినిపించింది లేడీ స్వింగ్ బౌలర్. ఆమెవరో ఇప్పుడు చూద్దాం..

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన రెండో వన్డేలో సఫారీలు డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు 1-1తో సిరీస్‌లో సమంగా ఉన్నారు. ఈ లెక్కలన్నీ పక్కనపెడితే.. డీఎల్‌ఎస్ పద్దతి ప్రకారం.. 45 ఓవర్లలో 234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది ఆస్ట్రేలియా మహిళల జట్టు. అయితే ఆ జట్టుకు ఆదిలోనే గట్టి షాకిచ్చింది మారిజానే కాప్. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ మూడో బంతికి ఊహించని విధంగా ఇన్ స్వింగర్ విసిరి.. మిడ్ వికెట్‌ను గిరాటేసింది. దీంతో అసలేం జరిగిందో అర్ధకక.. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరింది బెత్ మూనీ.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కాప్ వేసిన ఇన్‌స్వింగర్ అద్భుతమని.. ఇలాంటి బంతులు అరుదగా పడతాయని చెబుతూ.. ఫ్యాన్స్ నెట్టింట ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ఆమెను మెక్‌గ్రాత్, భువనేశ్వర్ కుమార్ లాంటి దిగ్గజ బౌలర్లతో పోల్చుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన కాప్.. బ్యాటింగ్‌లో 75 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

Follow Us
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..