Paris Olympics: ‘పీవీ సింధు పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాను..’: షాకిచ్చిన మను భాకర్.. ఎందుకో తెలుసా?

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో షూటర్ మను భాకర్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. జులై 28న మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో తొలిసారిగా ఈ స్టార్ షూటర్ చారిత్రాత్మక కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత్ నుంచి ఒలింపిక్ పతకం సాధించిన తొలి మహిళా షూటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. రెండు రోజుల తర్వాత, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను మరో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. స్వతంత్ర భారతదేశం నుంచి ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది.

Paris Olympics: 'పీవీ సింధు పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాను..': షాకిచ్చిన మను భాకర్.. ఎందుకో తెలుసా?
Manu Bhaker, Pv Sindhu
Follow us
Venkata Chari

|

Updated on: Jul 31, 2024 | 12:07 PM

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో షూటర్ మను భాకర్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. జులై 28న మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో తొలిసారిగా ఈ స్టార్ షూటర్ చారిత్రాత్మక కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత్ నుంచి ఒలింపిక్ పతకం సాధించిన తొలి మహిళా షూటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. రెండు రోజుల తర్వాత, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను మరో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. స్వతంత్ర భారతదేశం నుంచి ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. మను ఇప్పుడు తన విజయాలతో వర్ధమాన క్రీడాకారిణులకు ప్రేరణగా మారింది. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఆమె స్థాయిని మరింత పెంచాయి.

స్పోర్ట్‌స్టార్‌తో మను భాకర్ మాట్లాడుతూ, ‘భారత క్రీడా చరిత్రలో గొప్ప ఆటగాళ్లు తెలుసు. నా కాలంలో నాకు ఎప్పుడూ పీవీ సింధు, నీరజ్ చోప్రా తెలుసు. ఓ సమయంలో పీవీ సింధు కోసం నేను ఫేక్ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాను. కొందరు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ల నుంచి సింధును కాపాడేందుకు ఇలా చేశాను. అలాంటి వారికి రివర్స్ కౌంటర్‌ ఇచ్చేందుకే ఫేక్ అకౌంట్‌ క్రియోట్ చేశాను’ అంటూ పేర్కొంది.

ఇదే ఈ విషయంపై పీవీ సింధు ‘నీ మంచి మనసుకు థ్యాంక్స్ మను. 2 ఒలింపిక్‌ పతకాల క్లబ్‌లోకి స్వాగతం. మేం కూడా నీ క్లబ్‌లో చేరే క్రమంలో ఉన్నాం’ అంటూ పోస్ట్ చేసింది. కాగా, నేడు మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోరులో పీవీ సింధు మధ్యాహ్నం క్రిస్టిన్‌తో పోటీపడనుంది. ఈ పోటీలో గెలిస్తే క్వార్టర్స్‌కు సింధు చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

భారతదేశానికి చెందిన స్టార్ షూటర్ మను భాకర్ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి దక్షిణ కొరియాను ఓడించి కాంస్య పతకాన్ని సాధించింది. భారత జోడీ 16-10తో కొరియాకు చెందిన లీ వోన్హో, ఓహ్ యే జిన్‌లను ఓడించి ఈ ఒలింపిక్స్‌లో దేశానికి రెండో పతకాన్ని అందించింది. టోక్యో ఒలింపిక్స్‌లో, మను తన పిస్టల్‌లో లోపం కారణంగా ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది, కానీ, పారిస్‌లో రెండు పతకాలు సాధించడం ద్వారా గత గాయాన్ని అధిగమించింది.

బ్రిటీష్‌లో జన్మించిన భారతీయ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ 1900 ఒలింపిక్స్‌లో 200 మీటర్ల స్ప్రింట్, 200 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాలు సాధించాడు. అయితే, ఆ ఘనత స్వాతంత్య్రానికి ముందు జరిగింది. మను 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఇంకా పోటీ పడలేదు. ఆమె ఈ ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ పతకాలను కూడా సాధించగలదు. సరబ్జోత్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 577 స్కోరుతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఫైనల్స్‌కు చేరుకోలేకపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!