LSG Vs MI, IPL 2024: మార్కస్ స్టొయినిస్ అర్ధ సెంచరీ.. మళ్లీ ఓడిన ముంబై.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు

Lucknow Super Giants vs Mumbai Indians: ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్ ఆటతీరు మారడం లేదు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఆ జట్టు వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. తాజాగా మంగళవారం (ఏప్రిల్ 30) రాత్రి లక్నోతో జరిగిన మ్యాచ్ లోనూ ముంబై 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

LSG Vs MI, IPL 2024: మార్కస్ స్టొయినిస్ అర్ధ సెంచరీ.. మళ్లీ ఓడిన ముంబై.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
Lucknow Super Giants vs Mumbai Indians

Updated on: May 01, 2024 | 12:03 AM

Lucknow Super Giants vs Mumbai Indians: ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్ ఆటతీరు మారడం లేదు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఆ జట్టు వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. తాజాగా మంగళవారం (ఏప్రిల్ 30) రాత్రి లక్నోతో జరిగిన మ్యాచ్ లోనూ ముంబై 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. హార్దిక్ సేన విధించిన 145 పరుగుల టార్గెట్ ను లక్నో సూపర్ జెయింట్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. లక్నో బ్యాటర్లలో మార్కస్‌ స్టాయినిస్‌ (62) మరోసారి అర్ధశతకంతో రాణించాడు. అలాగే కెప్టెన్ కేఎల్‌ రాహుల్ (28), చివర్లో పూరన్‌ (14 నాటౌట్‌) పరుగుల చేసి లక్నోను విజయ తీరాలకు చేర్చాడు. ముంబయి బౌలర్లలో హార్దిక్‌ పాండ్య 2, తుషారా 1, నబి 1, గెరాల్డ్‌ 1 వికెట్ తీశారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీని ప్రకారం తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేహాల్‌ వధేలా(46), టిమ్‌ డేవిడ్‌ (35 నాటౌట్), ఇషాన్‌ కిషన్ (32) రాణించారు. లక్నో బౌలర్లలో మోసిన్‌ 2, స్టాయినిస్‌, నవీనుల్‌, మయాంక్‌, బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీశారు.

145 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మార్కస్ స్టోయినిస్ (62) హాఫ్ సెంచరీతో మెరిశాడు. లక్నోకు ఇది ఆరో విజయం. ఈ విజయంతో లక్నో సూపర్‌జెయింట్‌ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. అంతేకాదు ప్లేఆఫ్‌ దిశగా మరో అడుగు వేసింది. మరోవైపు ముంబైకి ఇది ఏడో ఓటమి. దీంతో హార్దిక్ సేన ప్లేఆఫ్ సమీకరణాలు మరింత క్లిష్టంగా మారాయి.

ఇవి కూడా చదవండి

 

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కొట్జియా, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రీవిస్, నమన్ ధీర్, షామ్స్ ములానీ

లక్నో సూపర్‌జెయింట్స్ (ప్లేయింగ్ ఎలెవన్):

కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్

 

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..