AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs DC: తడబడిన లక్నో.. ఢిల్లీ ముందు 168 టార్గెట్.. హాఫ్ సెంచరీతో బదోని సత్తా..

Lucknow Super Giants vs Delhi Capitals, 26th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ఢిల్లీ క్యాపిటల్స్ (DC)కి 168 పరుగుల లక్ష్యాన్ని అందించింది. జట్టులోని ఆయుష్ బదోని 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. అతను కూడా 8వ వికెట్‌కు అర్షద్ ఖాన్‌తో కలిసి 73 పరుగులు జోడించాడు. లక్నో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశాడు.

LSG vs DC: తడబడిన లక్నో.. ఢిల్లీ ముందు 168 టార్గెట్.. హాఫ్ సెంచరీతో బదోని సత్తా..
Kuldeep Yadav LSG vs DC IPL 2024
Venkata Chari
|

Updated on: Apr 12, 2024 | 9:41 PM

Share

Lucknow Super Giants vs Delhi Capitals, 26th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ఢిల్లీ క్యాపిటల్స్ (DC)కి 168 పరుగుల లక్ష్యాన్ని అందించింది. జట్టులోని ఆయుష్ బదోని 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. అతను కూడా 8వ వికెట్‌కు అర్షద్ ఖాన్‌తో కలిసి 73 పరుగులు జోడించాడు. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి (ఎకానా) స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశాడు.

ఢిల్లీ తరపున కుల్దీప్ యాదవ్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీశారు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

ఇవి కూడా చదవండి

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్(కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు..

ఢిల్లీ క్యాపిటల్స్: ఝే రిచర్డ్‌సన్, అభిషేక్ పోరెల్, కుమార్ కుషాగ్రా, సుమిత్ కుమార్, ప్రవీణ్ దూబే.

లక్నో సూపర్ జెయింట్స్: కృష్ణప్ప గౌతం, దీపక్ హుడా, మణిమారన్ సిద్ధార్థ్, అమిత్ మిశ్రా, మాట్ హెన్రీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..