LSG IPL 2023 Auction: ఈసారి టైటిల్‌ కొట్టాల్సిందే.. పూరన్‌ చేరికతో మరింత బలంగా రాహుల్‌ టీం.. లక్నో పూర్తి స్వ్కాడ్‌ ఇదే

Lucknow Super Giants Auction Players List : గత ఐపీఎల్‌ సీజన్‌లో ఫైనలిస్టుగా నిలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ సారి టైటిల్‌ కొట్టాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకే జట్టును మరింత పటిష్ఠం చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే వెస్టిండీస్‌కు చెందిన స్టార్‌ బ్యాటర్‌ అండ్‌ వికెట్‌ కీపర్‌ నికోలస్ పూరన్‌ను కొనుగోలు చేసింది.

LSG IPL 2023 Auction: ఈసారి టైటిల్‌ కొట్టాల్సిందే.. పూరన్‌ చేరికతో మరింత బలంగా రాహుల్‌ టీం.. లక్నో పూర్తి స్వ్కాడ్‌ ఇదే

Updated on: Dec 23, 2022 | 9:18 PM

Lucknow Super Giants Auction Players List : గత ఐపీఎల్‌ సీజన్‌లో ఫైనలిస్టుగా నిలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ సారి టైటిల్‌ కొట్టాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకే జట్టును మరింత పటిష్ఠం చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే వెస్టిండీస్‌కు చెందిన స్టార్‌ బ్యాటర్‌ అండ్‌ వికెట్‌ కీపర్‌ నికోలస్ పూరన్‌ను కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏకంగా రూ. 16 కోట్లు వెచ్చించింది. గతేడాది 10.75 కోట్లకు పురన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కానీ ఈ బ్యాటర్‌ పెద్దగా రాణించలేకపోయాడు. ఆతర్వాత ప్రపంచకప్‌లోనూ నిరాశపర్చాడు. అయితే ఇటీవల జరిగిన అబుదాబి టి10 లీగ్‌లో మాత్రం అదరగొట్టాడు. ఆ ప్రదర్శనతోనే రాహుల్‌ జట్టులోకి అడుగుపెట్టాడు. వీరితో పాటు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన లెఫ్టార్మ్‌ సీమర్‌ జయదేవ్‌ ఉనాద్కత్‌ను కూడా తీసుకుంది. అలాగే యశ్ ఠాకూర్, రొమారియో షెపర్డ్, అమిత్ మిశ్రా, ప్రేరక్ మన్కడ్, స్వప్నిల్ సింగ్ తదితరులను కూడా కొనుగోలు చేసింది. కాగా IPL చరిత్రలో అత్యంత ఖరీదైన జట్టు, లక్నో సూపర్‌జెయింట్స్ గత సీజన్‌లో అరంగేట్రం చేసి, మొదటిసారి ప్లేఆఫ్‌కు చేరుకుంది. అయితే దురదృష్టవశాత్తూ టైటిల్‌కు ఒక అడుగుదూరంలో నిలిచిపోయింది. అందుకే IPL 2023 కోసం మరింత బలమైన, సమతుల్యమైన టీంను ఏర్పాటుచేసుకంది. ఇందులో భాగంగానే పూరన్‌ లాంటి ఆటగాళ్లను కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.

మినీ వేలంలో లక్నో దక్కించుకున్న ఆటగాళ్లు ..

నికోలస్ పూరన్, జయదేవ్ ఉనద్కత్, యశ్ ఠాకూర్, రొమారియో షెపర్డ్, అమిత్ మిశ్రా, ప్రేరక్ మన్కడ్, స్వప్నిల్ సింగ్

ఇవి కూడా చదవండి

రిటైన్‌ ప్లేయర్స్‌..

కేఎల్ రాహుల్, ఆయుష్ బదోనీ, కర్ణ్ శర్మ, మనన్ వోహ్రా, దీపక్ హుడా, కైల్ మైయర్స్, కృనాల్ పాండ్యా, అవేశ్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్.

రిలీజైన ఆటగాళ్లు..

ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పుత్, దుష్మంత చమీర, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్

లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ స్క్వాడ్:

కేఎల్ రాహుల్, ఆయుష్ బదోని, కర్ణ్ శర్మ, మనన్ వోహ్రా, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మైయర్స్, కృనాల్ పాండ్యా, అవేశ్ ఖాన్, మార్క్ వుడ్, నిచోలాస్ పూర్, జయదేవ్ ఉనద్కత్. యశ్ ఠాకూర్, రొమారియో షెపర్డ్, అమిత్ మిశ్రా

ఐపీఎల్ లైవ్ యాక్షన్ లైవ్ ఇక్కడ వీక్షించండి