Video: టీమిండియాకు డేంజర్ సిగ్నల్.. 5 సిక్స్‌లు, 8 ఫోర్లతో తుఫాన్ సెంచరీ.. ఆసియాకప్ ముందు టెన్షన్ పెంచిన పాక్ సారథి..
Lanka Premier League 2023: అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కొలంబో స్ట్రైకర్స్ జట్టుకు బాబర్ అజామ్, పాతుమ్ నిసంక తుఫాన్ ఆరంభాన్ని అందించారు. ఈ జోడీ 12 ఓవర్లలోనే స్కోరు 100 దాటేసి ఛేజింగ్‌కు గట్టి పునాది వేసింది. ఈ దశలో 54 పరుగులు చేసిన పాతుమ్ నిశాంక ఔటయ్యాడు. అయినప్పటికీ, బాబర్ ఆజం పోరాటం కొనసాగింది.

Lanka Premier League 2023: లంక ప్రీమియర్ లీగ్‌లో బాబర్ అజామ్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. శ్రీలంకలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కొలంబో స్ట్రైకర్స్, గాలె టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కొలంబో స్ట్రైకర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలె టైటాన్స్ జట్టు మంచి బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. ఓపెనర్లు లసిత్ క్రుస్పుల్లే (36), షెవాన్ డేనియల్ (49) తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మూడో స్థానంలో వచ్చిన భానుక రాజపక్సే 30 పరుగులు అందించగా, టిమ్ సీఫెర్ట్ 35 బంతుల్లో 3 భారీ సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు చేశాడు. దీంతో గాలె టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.




అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కొలంబో స్ట్రైకర్స్ జట్టుకు బాబర్ అజామ్, పాతుమ్ నిసంక తుఫాన్ ఆరంభాన్ని అందించారు. ఈ జోడీ 12 ఓవర్లలోనే స్కోరు 100 దాటేసి ఛేజింగ్‌కు గట్టి పునాది వేసింది.
ఈ దశలో 54 పరుగులు చేసిన పాతుమ్ నిశాంక ఔటయ్యాడు. అయినప్పటికీ, బాబర్ ఆజం పోరాటం కొనసాగింది. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన బాబర్ మైదానంలోని ప్రతి మూలకు సిక్స్-ఫోర్లతో విజృంభించాడు.
అలాగే బాబర్ ఆజం కేవలం 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ తర్వాత బాబర్ 59 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 104 పరుగులు చేసి ఆఖరి ఓవర్ తొలి బంతికి పెవిలియన్ చేరాడు.
Thats the Century Number 10 in T20 Cricket for King Babar Azam 🥵#BabarAzam #BabarAzam𓃵 #LPL2023 pic.twitter.com/D4Frfs7GbJ
— King Babar Azam Army (@kingbabararmy) August 7, 2023
ఆ తర్వాత 5 బంతుల్లో 14 పరుగులతో మహ్మద్ నవాజ్ రెచ్చిపోయాడు. పేసర్ కసున్ రజిత వేసిన మొదటి రెండు బంతుల్లో నవాజ్ మొత్తం 4 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతను ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. ఈ విధంగా 19.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని కొలంబో స్ట్రైకర్స్ జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు.
కొలంబో స్ట్రైకర్స్ ప్లేయింగ్ 11: నిరోషన్ డిక్వెల్లా (కెప్టెన్), బాబర్ ఆజం, పాతుమ్ నిస్సాంక, నువానీదు ఫెర్నాండో, మహ్మద్ నవాజ్, లాహిరు ఉదరా, చమిక కరుణరత్నే, రమేష్ మెండిస్, నసీమ్ షా, లక్షణ సండకన్, మతీష్ పతిరాన.
గాలె టైటాన్స్ ప్లేయింగ్ 11: షెవాన్ డేనియల్, లసిత్ క్రుస్పుల్లే, భానుక రాజపక్సే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, దసున్ షనక (కెప్టెన్), అకిలా దనంజయ, కసున్ రజిత, మినోద్ భానుక, తబ్రిజ్ షమ్సీ, రిచర్డ్ నగరవ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..