AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs IND: టీమిండియాలో ఆ ప్లేయర్ చాలా డేంజర్.. ఆసీస్‌‌ను హెచ్చరించిన మాజీ క్రికెటర్

భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఫామ్‌పై పెరుగుతున్న ఆందోళనలపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మైక్ హెస్సన్ స్పందించాడు. కోహ్లీ దృష్టి భారతదేశం కోసం ఆటలను గెలవడంపైనే ఉందని, వ్యక్తిగత మైలురాళ్లపై కాదని పేర్కొన్నాడు. నవంబర్ 22 నుండి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆస్ట్రేలియా వంటి జట్టుకు కోహ్లీ ఈ వెర్షన్ ప్రమాదకరమని చెప్పారు.

AUS vs IND: టీమిండియాలో ఆ ప్లేయర్ చాలా డేంజర్.. ఆసీస్‌‌ను హెచ్చరించిన మాజీ క్రికెటర్
Mike Hesson
Velpula Bharath Rao
|

Updated on: Oct 16, 2024 | 4:02 PM

Share

భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఫామ్‌పై పెరుగుతున్న ఆందోళనలపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మైక్ హెస్సన్ స్పందించాడు. కోహ్లీ దృష్టి భారతదేశం కోసం ఆటలను గెలవడంపైనే ఉందని, వ్యక్తిగత మైలురాళ్లపై కాదని పేర్కొన్నాడు. నవంబర్ 22 నుండి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆస్ట్రేలియా వంటి జట్టుకు కోహ్లీ ఈ వెర్షన్ ప్రమాదకరమని చెప్పారు. ఫ్యాబ్ ఫోర్ రేసులో కోహ్లీ సంఖ్య తగ్గడాన్ని అభిమానులు, నిపుణులు ఎత్తి చూపారు. 2019 నుండి స్టార్ బ్యాటర్ ఫార్మాట్‌లో కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేశాడు.

“విరాట్ కోహ్లీ ఏ దశలో ఉన్నాడంటే అతను భారత్‌కు ఎట్టి పరిస్థుతుల్లో గెలిపించాలనే దశలో ఉన్నాడు ఇతర జట్లకు ఇది ప్రమాదకరమైన దశ అని నేను భావిస్తున్నాను, ఎందుకంటే అతను సంఖ్యలపై దృష్టి పెట్టకుండా అలా చేస్తే, పెద్ద స్కోర్లు ఆస్ట్రేలియాలో ఒక టెంపోను పట్టుకోవడం చాలా ముఖ్యం, కోహ్లి ఆ సమయంలో 30 నుండి 60 ఓవర్ల వరకు ఎదురుదాడి చేయడం చాలా ముఖ్యం.. పరుగులతో అతను ఎదురుదాడి చేయవచ్చు” అని మైక్ హెస్సన్ అని పేర్కొన్నారు.

“విరాట్ బంగ్లాదేశ్‌పై పెద్ద స్కోర్లు రాకపోయినా, అతను బాగా ఆడుతున్నట్లు, మళ్లీ పుంజుకుంటున్నట్లు కనిపించాడు. న్యూజిలాండ్‌తో ఆడిన తర్వాత, ఆస్ట్రేలియాతో ఆడడం వల్ల అతనికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి” అని చెప్పుకొచ్చారు. విరాట్‌తో ఆసిస్ ముప్పు ఉందని ఆయన హెచ్చరించాడు. విరాట్‌కి ఆటపై పూర్తి అవగాహన ఉండడంతో..ఎక్కడ ఎప్పుడు ఆడాలో అతనికి తెలుసాన్నారు. భారత్ యువ క్రికెటర్ల కన్నా విరాట్‌తో ఆసీస్‌కు ముప్పు ఉందన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..