కోహ్లికి భారీ ఫైన్‌

మొహాలి :  ఐపీఎల్‌-12లో బెంగళూరు పరాజయాల పరంపరకు తెరపడింది.  ఎట్టకేలకు ఏడో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఆరు వరుస పరాజయాల తర్వాత కోహ్లి పట్టుదల, డివిలియర్స్‌ మెరుపులు.. రాయల్‌ చాలెంజర్స్‌కు తొలి విజయాన్ని అందించాయి. బౌలర్లు కాస్త రాణించడం.. బ్యాటింగ్‌లో టాపార్డర్‌ దుమ్మురేపడం.. ఆఖర్లో స్టొయినిస్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌.. అన్ని కలిసొచ్చి.. పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌పై విజయాన్ని అందుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా… ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రం జరిమానా పడింది. బెంగళూరు-కింగ్స్‌ […]

కోహ్లికి భారీ ఫైన్‌
Follow us

|

Updated on: Apr 14, 2019 | 1:14 PM

మొహాలి :  ఐపీఎల్‌-12లో బెంగళూరు పరాజయాల పరంపరకు తెరపడింది.  ఎట్టకేలకు ఏడో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఆరు వరుస పరాజయాల తర్వాత కోహ్లి పట్టుదల, డివిలియర్స్‌ మెరుపులు.. రాయల్‌ చాలెంజర్స్‌కు తొలి విజయాన్ని అందించాయి. బౌలర్లు కాస్త రాణించడం.. బ్యాటింగ్‌లో టాపార్డర్‌ దుమ్మురేపడం.. ఆఖర్లో స్టొయినిస్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌.. అన్ని కలిసొచ్చి.. పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌పై విజయాన్ని అందుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా… ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రం జరిమానా పడింది. బెంగళూరు-కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ కారణంగా కోహ్లీకి రూ.12లక్షలు జరిమానా విధించారు. ఈ సీజన్‌లో ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను బెంగళూరు జట్టు ఉల్లంఘించడం ఇదే తొలిసారి.