ఆమె సంకల్పం ముందు.. తలవంచిన వైకల్యం.. టీమిండియా విన్నింగ్ టీమ్‌లో తెలుగమ్మాయి..
Women’s Cricket Team for Blind: ఒక పక్క ఆవయవ లోపం.. మరోవైపు పేదరికం.. వీటిని అధిగమంచి పట్టుదల, కృషి, కఠోర సాధన, క్రమశిక్షణతో అనుకున్న లక్ష్యం సాధించింది దీపిక. యావత్తు దేశం గర్వించదగ్గ క్రికెట్ క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది.. ప్రపంచ అంధుల మహిళా క్రికెట్ టీ20లో భారత జట్టు విజయకేతనం ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించింది.. ఆమె శ్రీ సత్య సాయి జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టికి చెందిన విద్యార్ధిని ఆమె తల్లిదండ్రులు..

శ్రీసత్యసాయి జిల్లా, ఆగస్టు 30: ఆమె ముందు అవయవలోపం తలవంచింది. క్రీడా ప్రపంచం దాసోసహం అంది. పేదరికం పారిపోయింది. ఒక పక్క ఆవయవ లోపం.. మరోవైపు పేదరికం.. వీటిని అధిగమంచి పట్టుదల, కృషి, కఠోర సాధన, క్రమశిక్షణతో అనుకున్న లక్ష్యం సాధించింది దీపిక. యావత్తు దేశం గర్వించదగ్గ క్రికెట్ క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది.. ప్రపంచ అంధుల మహిళా క్రికెట్ టీ20లో భారత జట్టు విజయకేతనం ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించింది.. ఆమె శ్రీ సత్య సాయి జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టికి చెందిన విద్యార్ధిని ఆమె తల్లిదండ్రులు చిక్కతిమ్మప్ప, చిత్తమ్మ, వ్యవసాయ కూలీలు.
దీపిక చిన్నప్పటి నుంచి కంటి చూపు సమస్యతో బాధపడేది. ప్రాథమిక దశ నుంచి కర్ణాటకలోని ప్రభుత్వ అంధుల విద్యాలయంలో చదివింది. ప్రస్తుతం బెంగళూరులో బీఏ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. చిన్నప్పటి నుంచి క్రికెట్ పై ఆసక్తి పెంచుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ కర్నాటక రాష్ట్రం తరపున భారత ఆంధుల మహిళా జట్టులో స్థానం సంపాదించుకుంది. ఇటీవల బర్మింగ్ హామ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ -మహిళా క్రికెట్ టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు ఎంపికైంది. పలు మ్యాచ్ ల్లో ప్రతిభ చూపింది. ప్రభుత్వం సహకారం అందించాలి అంటున్నారు దీపిక తల్లిదండ్రులు.
కర్ణాటక సరిహద్దుకు అనుకుని తమ గ్రామం ఉండటంతో కుమార్తెను కర్ణాటక పాటశాలల్లో చదివించామన్నారం. ఎన్నో పతకాలు సాధించింది. ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తే….మరింత ఉన్నత స్థానానికి వెళుతుంది అంటున్నారు దీపిక తల్లిదండ్రులు….
చరిత్ర సృష్టించిన అంధుల మహిళల క్రికెట్ జట్టు
ప్రపంచ వేదికపై మరోసారి భారత పతాక రెపరెపలాడింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్( ఐబీఎస్‌ఏ) ప్రపంచ క్రీడల్లో టైటిల్ కైవసం చేసుకుని భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. దీంతో గతంలో ఉన్న రికార్డులను క్లీన్ బోల్డ్ చేసి విశ్వ విజేతగా నిలిచింది. వర్షం అంతరాయాల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా విసిరిన లక్ష్యాన్ని కేవలం 3.3 ఓవర్లలో ఒకే వికెట్‌ను కోల్పోయి.. గోల్డ్ మెడల్‌ను దక్కించుకుంది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ గేమ్స్‌తొలి చాంపియన్‌గా ఇండియన్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈ టోర్నీలో అజేయ జట్టుగా నిలిచిన అంధుల క్రికెట్ జట్టు.. ఫైనల్‌తో కలుపుకొని ఆస్ట్రేలియాపై 3 సార్లు, ఇంగ్లాండ్‌పై రెండు సార్లు గెలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం