KL Rahul: సెంచరీతో సౌతాఫ్రికా బౌలర్లపై బీభత్సం.. రెండో ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ స్పెషల్ రికార్డ్..
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ సిక్సర్ బాది తన 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేఎల్ 66వ ఓవర్‌లో గెరాల్డ్ కుట్జీపై మిడ్-వికెట్ వైపు సిక్సర్ కొట్టాడు. ఈ క్రమంలో 133 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ కేవలం 80 బంతుల్లో సిక్సర్ కొట్టి యాభైని పూర్తి చేశాడు. తొలి రోజు 70 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్.. రెండో రోజు 101 పరుగులు పూర్తి చేసిన చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
South Africa vs India, 1st Test: సెంచూరియన్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించి టీమ్ ఇండియా వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు. కేఎల్ రాహుల్ 137 బంతుల్లో 101 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టు స్కోరును 245 పరుగులకు తీసుకెళ్లాడు. కేఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. అలాగే 73.72 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.
సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసిన రాహుల్..
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ సిక్సర్ బాది తన 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేఎల్ 66వ ఓవర్‌లో గెరాల్డ్ కుట్జీపై మిడ్-వికెట్ వైపు సిక్సర్ కొట్టాడు. ఈ క్రమంలో 133 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ కేవలం 80 బంతుల్లో సిక్సర్ కొట్టి యాభైని పూర్తి చేశాడు. తొలి రోజు 70 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్.. రెండో రోజు 101 పరుగులు పూర్తి చేసిన చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 245 పరుగుల వద్ద ఆగిపోయింది.
సెంచూరియన్‌లో వరుసగా రెండో సెంచరీ..
📸📸💯@klrahul 🙌🙌#SAvIND pic.twitter.com/lBEC4UisFa
— BCCI (@BCCI) December 27, 2023
సెంచూరియన్‌లో రాహుల్‌కి ఇది వరుసగా రెండో సెంచరీ. భారత్ గత చివరి సిరీస్‌లో మూడంకెల మార్కును చేరుకున్నాడు. దీంతో ఒకే వేదికలో అధిక సెంచరీలు చేసిన మొదటి విజిటింగ్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. కేఎల్ రాహుల్ కెరీర్‌లో 8వ సెంచరీని పూర్తి చేశాడు.
కేఎల్ రాహుల్ చేసిన ఈ 8 సెంచరీలలో రెండు సెంచరీలు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మైదానాల్లో ఒకటైన దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో వచ్చాయి. సెంచూరియన్ మైదానంలో కేఎల్ రాహుల్ వరుసగా రెండో సెంచరీ సాధించాడు. 2021లో భారత్ దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా సెంచూరియన్ మైదానంలో జరిగిన సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ 123 పరుగులతో అద్భుత సెంచరీని పూర్తి చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 113 పరుగులతో అద్భుత విజయం సాధించగా, కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
ఇరుజట్లు..
భారత్ ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11: టెంబా బావుమా (కెప్టెన్), డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రామ్, టోనీ డిజార్జ్, కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వేరియన్ (వికెట్), మార్కో యాన్సన్, కగిసో రబడ, గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బెర్గర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..