KL Rahul: ఎంఎస్ ధోని స్పెషల్ జాబితాలో చేరిన కేఎల్ రాహుల్.. ఆ రికార్డ్ ఏంటంటే?

India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఇక రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. 65 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (89), మహ్మద్ సిరాజ్ (5) క్రీజులో నిలిచారు.

Venkata Chari

|

Updated on: Dec 27, 2023 | 2:33 PM

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అజేయ అర్ధ సెంచరీ సాధించి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రిషబ్ పంత్ రికార్డులను సమం చేయడం కూడా విశేషం.

1 / 5
ఈ మ్యాచ్‌లో, 6వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తోన్న కేఎల్ రాహుల్ 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 70 పరుగులతో తొలిరోజు అజేయంగా నిలిచాడు. దీనితో పాటు, అతను మూడు ఫార్మాట్లలో ఒక విదేశీ పిచ్‌పై 50+ పరుగులు చేసిన మూడవ భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

2 / 5
ఇంతకు ముందు భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రిషబ్ పంత్ మాత్రమే ఈ ఘనత సాధించారు. విదేశాల్లో జరిగిన వన్డే, టీ20, టెస్ట్ క్రికెట్‌లో పంత్, ధోనీ 50+ స్కోర్‌ల ప్రత్యేక రికార్డును లిఖించారు.

3 / 5
అంతకుముందు విదేశాల్లో జరిగిన వన్డే, టీ20 క్రికెట్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడిన కేఎల్ రాహుల్ 50+ పరుగులు చేసి మెరిశాడు. టెస్టుల్లోనూ వికెట్ కీపర్‌గా ప్రమోట్ అయిన రాహుల్.. దక్షిణాఫ్రికాపై హాఫ్ సెంచరీ సాధించాడు. దీని ద్వారా ధోనీ-పంత్ పేరిట ఉన్న ప్రత్యేక రికార్డు జాబితాలో కేఎల్ రాహుల్ చేరిపోయాడు.

4 / 5
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఇక రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. 65 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (89), మహ్మద్ సిరాజ్ (5) క్రీజులో నిలిచారు.

5 / 5
Follow us