- Telugu News Photo Gallery Cricket photos From virat kohli to shubman gill these indian pkayers centuries in 2023 check full list
Year Ender 2023: ఈ ఏడాది సెంచరీలతో సత్తా చాటిన 9మంది భారత బ్యాటర్లు.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?
Indian Batters in 2023: 2023లో మొత్తం 9 మంది బ్యాట్స్‌మెన్‌లు వివిధ ఫార్మాట్ల క్రికెట్‌లో టీమ్ ఇండియా తరపున సెంచరీలు సాధించారు. కొంతమంది నిరాశ పరిచారు. మరికొంతమంది మాత్రం శతకానికి కొద్ది దూరంలో నిలిచిపోయారు. అత్యధిక సెంచరీలు విరాట్ కోహ్లి పేరిట ఉన్నాయి. లిస్టులో ఎవరెవరున్నారో ఇప్పుడు చూద్దాం..
Updated on: Dec 26, 2023 | 9:48 PM

Indian Batters in 2023: 2023లో మొత్తం 9 మంది బ్యాట్స్‌మెన్‌లు వివిధ ఫార్మాట్ల క్రికెట్‌లో టీమ్ ఇండియా తరపున సెంచరీలు సాధించారు. అత్యధిక సెంచరీలు విరాట్ కోహ్లి పేరిట ఉన్నాయి.

2023లో భారత జట్టు తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. కింగ్ కోహ్లీ ఈ ఏడాది 34 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 8 సెంచరీలు చేశాడు.

శుభ్‌మన్ గిల్ బ్యాట్ కూడా ఈ ఖాతాలో చేరింది. ఈ ఏడాది భారత జట్టు తరపున ఈ యువ బ్యాట్స్‌మెన్ 7 సెంచరీలు సాధించాడు. అతను 47 మ్యాచ్‌ల్లో ఈ సంఖ్యను చేరుకున్నాడు.

ఈ రేసులో రోహిత్ శర్మ కూడా వెనకడుగు వేయలేదు. అతను 2023 సంవత్సరంలో 34 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 4 సెంచరీలు చేశాడు.

ఈ ఏడాది కూడా శ్రేయాస్ అయ్యర్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 25 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు సాధించాడు.

ఈ ఏడాది సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తలో 2 సెంచరీలు సాధించారు. ఈ ఏడాది యశస్వి 17, కేఎల్ రాహుల్ 29, సూర్యకుమార్ యాదవ్ 40 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాల్గొన్నారు.

ఈ ఏడాది రితురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్‌లు ఒక్కో సెంచరీని నమోదు చేశారు. ఈ ఏడాది రితురాజ్ 15 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా, సంజూ శాంసన్ ఈ ఏడాది 13 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.





























