SA vs IND 1st Test: సెంచరీతో మెరిసిన రాహుల్.. ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్..
సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు జరుగుతోంది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ 101 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 121/6 స్కోరు నుంచి జట్టును 245 పరుగుల స్కోరుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ పోషించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ 5 వికెట్లు తీశాడు.
KL Rahul Century: సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు జరుగుతోంది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ 101 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 121/6 స్కోరు నుంచి జట్టును 245 పరుగుల స్కోరుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ పోషించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ 5 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నాండ్రే బెర్గర్ 3 వికెట్లు పడగొట్టాడు. గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సన్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.
5 వికెట్లతో మెరిసిన రబాడ..
దక్షిణాఫ్రికా తరపున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా కగిసో రబాడ నిలిచాడు. కగిసో రబాడ 20 ఓవర్లలో 59 పరుగుల వద్ద ఐదుగురు ఆటగాళ్లను అవుట్ చేశాడు. తొలి టెస్టు ఆడుతున్న నాండ్రే బెర్గర్ 3 వికెట్లు పడగొట్టాడు. మార్కో యూన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ తలో వికెట్ పడగొట్టారు.
208 పరుగులతో రెండో రోజు..
View this post on Instagram
అంతకుముందు, భారత జట్టు రెండో రోజు 8 వికెట్లకు 208 పరుగుల వద్ద ఆట ప్రారంభించింది. ఈరోజు 238 పరుగుల స్కోరుపై టీమ్ ఇండియాకు తొలి దెబ్బ తగిలింది. 22 బంతుల్లో 5 పరుగులు చేసి గెరాల్డ్ కోయెట్జీ వేసిన బంతికి మహ్మద్ సిరాజ్ ఔటయ్యాడు. తొలి రోజు కేఎల్ రాహుల్ 70 పరుగులతో నాటౌట్ గా వెనుదిరిగాడు. ఈరోజు ఈ బ్యాట్స్‌మెన్ సెంచరీ ఫిగర్‌ని టచ్ చేశాడు. సెంచరీ చేసిన తర్వాత కేఎల్ రాహుల్ నాంద్రే బెర్గర్ బంతికి పెవిలియన్ బాట పట్టాడు.
📸📸💯@klrahul 🙌🙌#SAvIND pic.twitter.com/lBEC4UisFa
— BCCI (@BCCI) December 27, 2023
ఇరుజట్లు..
భారత్ ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11: టెంబా బావుమా (కెప్టెన్), డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రామ్, టోనీ డిజార్జ్, కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వేరియన్ (వికెట్), మార్కో యాన్సన్, కగిసో రబడ, గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బెర్గర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..