AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul- Athiya Shetty: రాహుల్‌, అతియాల పెళ్లి ముహూర్తం ఫిక్స్‌! గ్రాండ్‌ వెడ్డింగ్‌ ఎక్కడంటే?

KL Rahul - Athiya Shetty Wedding: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్ రాహుల్‌, బాలీవుడ్ సీనియర్‌ హీరో సునీల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరి ప్రేమకు ఇరు పెద్దల ఆశీర్వాదం కూడా లభించింది. దీంతో త్వరలోనే పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమయ్యారీ లవ్‌బర్డ్స్‌.

KL Rahul- Athiya Shetty: రాహుల్‌, అతియాల పెళ్లి ముహూర్తం ఫిక్స్‌! గ్రాండ్‌ వెడ్డింగ్‌ ఎక్కడంటే?
Kl Rahul Athiya Shetty
Basha Shek
|

Updated on: Sep 06, 2022 | 10:58 AM

Share

KL Rahul – Athiya Shetty Wedding: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్ రాహుల్‌, బాలీవుడ్ సీనియర్‌ హీరో సునీల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరి ప్రేమకు ఇరు పెద్దల ఆశీర్వాదం కూడా లభించింది. దీంతో త్వరలోనే పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమయ్యారీ లవ్‌బర్డ్స్‌. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలోఈ శుభకార్యానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఖండాలాలోని అతియా తండ్రి సునీల్ శెట్టి లగ్జరీ బంగ్లాలో గ్రాండ్‌గా ఈ వెడ్డింగ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇటీవలే ఓ వెడ్డింగ్‌ ప్లానర్‌ కూడా ఈ బంగ్లాను సందర్శించి పెళ్లికి గల కావాల్సిన నిర్వహణ ఏర్పాట్లపై రాహుల్‌, అతియా కుటుంబ సభ్యులతో చర్చించాడట.

కాగా గతంలో ముంబైలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో రాహుల్‌, అతియాల పెళ్లి వేడుక నిర్వహించాలనుకున్నారట. అయితే ఇప్పుడు ఈ వివాహ వేదిక ఖండాలాలో సునీల్‌శెట్టికి ఉన్న బంగ్లాకు మార్చారట. కాగా సునీల్- మనా శెట్టి దంపతులకు చెందిన ఈ ఇల్లు 17 సంవత్సరాల క్రితం నిర్మించారు. చుట్టూ గ్రీనరీతో పాటు విశాలమైన ప్రదేశంలో ఈ బంగ్లా విస్తరించి ఉంది. కాగా కేఎల్ రాహుల్, అతియా మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. సూరజ్ పంచోలీ సరసన హీరో చిత్రంతో 2015లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అతియా. ముబారకన్, మోతీచూర్ చక్నాచూర్ సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపుతెచ్చుకోలేకపోయింది. ఇదే సమయంలో రాహుల్‌తో రిలేషన్‌షిప్‌తో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. కాగా రాహుల్‌ ప్రస్తుతం దుబాయ్‌ వేదికగా జరగుతున్న అసియాకప్‌లో పాల్గొంటున్నాడు. త్వరలో ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోనూ కీలకం కానున్నాడు. ఈ మెగా టోర్నీ తర్వాతే అతియాతో కలిసి పెళ్లిపీటలెక్కనున్నాడీ స్టార్‌ క్రికెటర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..