KKR vs RR Highlights, IPL 2023: సెంచరీ దిశగా జైస్వాల్.. విజయానికి చేరువలో రాజస్థాన్

| Edited By: Basha Shek

Updated on: May 11, 2023 | 10:47 PM

Kolkata Knight Riders vs Rajasthan Royals Highlights in Telugu: రాజస్థాన్ దుమ్ము రేపింది. గురువారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 13.1 ఓవర్లలోనే ఛేదించింది.

KKR vs RR Highlights, IPL 2023: సెంచరీ దిశగా జైస్వాల్.. విజయానికి చేరువలో రాజస్థాన్
Kkr Vs Rr, Ipl 2023

Kolkata Knight Riders vs Rajasthan Royals Highlights in Telugu: రాజస్థాన్ దుమ్ము రేపింది. గురువారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 13.1 ఓవర్లలోనే ఛేదించింది.  యశస్వి జైస్వాల్‌ (47 బంతుల్లో 98, 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు, సంజూశామ్సన్‌ (29 బంతుల్లో 48) రాణించడంతో ఆ జట్టు అవలీలగా విజయం సాధించింది. ఐపీఎల్  16వ సీజన్‌లో భాగంగా ఈ రోజు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగుల చేసింది. ఈ క్రమంలో కోల్‌కతా తరఫున వెంకటేష్ అయ్యర్(57) అర్థసెంచరీతో రాణించగా.. కెప్టెన్ నితీష్ రాణా(22), ఓపెనర్ రహ్మతుల్లా గుర్భాజ్(18) పరుగులతో పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో విజృంభించగా.. కోల్‌కతా ఓపెనర్లు ఇద్దరినీ కూడా ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్ బాట పట్టించాడు. అలాగే కేఎమ్ అసిఫ్, సందీప్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు. అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఎదుట 150 పరుగుల లక్ష్యం ఉంది.

KKR vs RR తుది జట్లు..

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/(కెప్టెన్)), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కేఎమ్ ఆసిఫ్, యుజువేంద్ర చాహల్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 11 May 2023 10:44 PM (IST)

    జైస్వాల్‌ సెంచరీ మిస్‌.. రాజస్థాన్‌ ఘన విజయం..

    యశస్వి జైస్వాల్‌ (47 బంతుల్లో 98, 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు, సంజూశామ్సన్‌ (29 బంతుల్లో 48) రాణించడంతో కోల్‌కతాపై రాజస్థాన్‌ ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని13.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది శామ్సన్‌ సేన

  • 11 May 2023 10:34 PM (IST)

    దుమ్ము దులుపుతోన్న జైస్వాల్

    150 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ విజయానికి చేరువగా నిలిచింది.  యశస్వి జైస్వాల్ సునామీ ఇన్నింగ్స్ ( 42 బంతుల్లో 89) సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం ఆ జట్టు విజయానికి 48 బంతుల్లో 10 పరుగులు అవసరం.

  • 11 May 2023 10:00 PM (IST)

    KKR vs RR Live Score, IPL 2023: జైశ్వాల్ పేరిట చరిత్ర పునర్లిఖితం..

    రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ కోల్‌కతాపై చరిత్రలో నిలిచిపోయేలా అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో 13 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. కాగా, అంతకముందు ఈ రికార్డును కేఎల్ రాహుల్(14 బంతుల్లో), పాట్ కమ్మిన్స్(14 బాల్స్) సమంగా పంచుకున్నారు.

  • 11 May 2023 09:50 PM (IST)

    KKR vs RR Live Score, IPL 2023: తడబడిన బట్లర్.. ఖాతా తెరవకుండానే..

    రెండో ఓవర్ సరిగ్గా పూర్తి కాక ముందే రాజ‌స్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. రాజస్థాన్ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్(0) ఖాతా తెరవకుండానే ర‌నౌట‌య్యాడు. రన్ తీయబోతుండగా బంతిని అందుకున్న ర‌స్సెల్ త్రో విస‌ర‌డంతో బ‌ట్ల‌ర్ వెనుదిరిగాడు. య‌శ‌స్వీ జైస్వాల్(49), కెప్టెన్ సంజూ శామ్సన్(1)  క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 09:46 PM (IST)

    KKR vs RR Live Score, IPL 2023: తొలి ఓవ‌ర్‌లోనే య‌శ‌స్వీ విధ్వ‌సం..

    రాజస్థాన్ రాయల్స్ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ తొలి ఓవ‌ర్‌లోనే  విధ్వంసం సృష్టిచాడు బ్యాటింగ్ చేశాడు. నితీశ్ రానా వేసిన ఈ ఓవర్‌లో ఏకంగా 26 ప‌రుగులు వచ్చేలా షాట్స్ ఆడాడు జైస్వాల్.

  • 11 May 2023 09:24 PM (IST)

    ముగిసిన కోల్‌కతా బ్యాటింగ్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

    నేటి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగుల చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఎదుట 150 పరుగుల లక్ష్యం ఉంది. ఇక కోల్‌కతా తరఫున వెంకటేష్ అయ్యర్(57) అర్థసెంచరీతో రాణించగా.. కెప్టెన్ నితీష్ రాణా(22), ఓపెనర్ రహ్మతుల్లా గుర్భాజ్(18) పరుగులతో పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో విజృంభించగా.. కోల్‌కతా ఓపెనర్లు ఇద్దరినీ కూడా ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్ బాట పట్టించాడు. అలాగే కేఎమ్ అసిఫ్, సందీప్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.

  • 11 May 2023 07:58 PM (IST)

    KKR vs RR Live Score, IPL 2023: రెండో ఓపెనర్ కూడా పెవిలియన్‌కే..

    కోల్‌కతా తరఫున బ్యాటింగ్ కోసం ఓపెనర్స్‌గా వచ్చిన ఇద్దరిని రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్ బాట పట్టించాడు.  మూడో ఓవర్ 2వ బంతికి జేసన్ రాయ్(10)ని.. ఆ వెంటనే ఐదో ఓవర్ తొలి బంతికి రహ్మతుల్లా గుర్భాజ్‌(18)ని ట్రెంట్ బౌల్ట్ ఔట్ చేశాడు. దీంతో క్రీజులో ఉన్న వెంకటేష్ అయ్యర్‌తో కెప్టెన్ నితిష్ రాణా జత కట్టాడు.

  • 11 May 2023 07:47 PM (IST)

    KKR vs RR Live Score, IPL 2023: తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా..

    నేటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కి ఆదిలోనే షాక్ తగిలింది. టీమ్ ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన జేసన్ రాయ్ 10 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవ‌ర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన అత‌ను రెండో బాల్‌కు షాట్ ఆడాడు. దాన్ని కాస్త బౌండ‌రీ వ‌ద్ద ఉన్న హెట్‌మెయ‌ర్ క్యాచ్ ప‌ట్ట‌డంతో కోల్‌క‌తా తొలి వికెట్ కోల్పోయింది. ఫలితంగా వెంకటేష్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.

  • 11 May 2023 07:16 PM (IST)

    స‌బ్‌స్టిట్యూట్స్ ప్లేయర్స్..

    రాజ‌స్థాన్ రాయల్స్: డొన‌వాన్ ఫెరేఇరా, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్, రియాన్ ప‌రాగ్, మురుగ‌న్ అశ్విన్, న‌వ్‌దీప్ సైనీ.

    కోల్‌క‌తా నైట్ రైడర్స్: సుయాశ్ శ‌ర్మ‌, వైభ‌వ్ అరోరా, జ‌గ‌దీశ‌న్, ఉమేశ్ యాద‌వ్, ఫెర్గూస‌న్.

  • 11 May 2023 07:09 PM (IST)

    KKR vs RR Live Score, IPL 2023: తుది జట్లు..

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

    రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/(కెప్టెన్)), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కేఎమ్ ఆసిఫ్, యుజువేంద్ర చాహల్

  • 11 May 2023 07:07 PM (IST)

    KKR vs RR Live Score, IPL 2023: టాస్ గెలిచిన రాజస్థాన్..

    నేటి మ్యాచ్‌ సందర్భంగా టాస్ గెలిచిన రాజస్థాన్ టీమ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హోమ్ గ్రౌండ్‌లో కోల్‌కతా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. ఈ క్రమంలో నేటి మ్యాచ్ కోసం రాజస్థాన్ టీమ్ కుల్దీప్ యాదవ్ స్థానంలో ట్రెంట్ బోల్ట్‌ని.. మురుగన్ స్థానంలో కేఎమ్ అసిఫ్ జట్టులోకి వచ్చారు. మరోవైపు కోల్‌కతా టీమ్ తరఫున కూడా వైభవ్ అరోరా స్థానంలో అన్కుల్ రాయ్ టీమ్‌లోకి వచ్చాడు.

  • 11 May 2023 06:52 PM (IST)

    ఆర్‌సీబీకి చాలా కీలక మ్యాచ్..

    కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్  బెంగళూర్ టీమ్‌కి చాలా కీలకం. ఎందుకంటే ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో కేకేఆర్, ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్ సమంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో రాజస్థాన్ రాయల్స్ ఈ రోజు ఓడిపోతే RCB జట్టు ప్లేఆఫ్ కల మరింత సజీవంగా ఉంటుంది. ఎందుకంటే RCB జట్టుకు తదుపరి ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్. అంటే కేకేఆర్, ఆర్సీబీలపై రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోవడం ఖాయం.

  • 11 May 2023 06:41 PM (IST)

    ప్లేఆఫ్ రేసులో ఎవరు ముందున్నారంటే..

    ఐపీఎల్ 16వ సీజన్‌లో ఇప్పటివరకు కూడా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్ రేసులో సమంగానే ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు కూడా 11-11 మ్యాచ్‌లు ఆడగా, రెండింటికీ 10-10 పాయింట్లు ఉన్నాయి. ఇక నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్లు ప్లేఆఫ్ రేసులో ముందుకు ఆడుగులు వేస్తుంది. అలాగే ఓడిన జట్టుకు టోర్నీలో కష్టాలు పెరుగుతాయి.

  • 11 May 2023 06:38 PM (IST)

    అపజయాలకు అడ్డుకట్ట వేసేనా..?

    కోల్‌కతా వేదికగా జరుగుతున్న నేటి మ్యాచ్‌లో గెలుపు సాధించడం సంజూ శామ్సన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ టీమ్‌కి చాలా అవసరం. ఇప్పటికే 3 మ్యాచ్‌లు వరుసగా ఓడిన రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఎలా అయినా గెలవాలనే పట్టుదల మీద ఉంది. మరోవైపు నితిష్ రాణా సారథ్యంలోని కోల్‌కతా జట్టు గత 2 మ్యాచ్‌లలో వరుసగా విజయం సాధించి దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్ ఖాతాలోని అపజయాలకు నేటి మ్యాచ్‌లోనైనా అడ్డుకట్ట పడుతుందా..? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Published On - May 11,2023 6:31 PM

Follow us