KKR Retention List: కాస్ట్లీ ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కేకేఆర్.. రిటైన్, రిలీజ్ లిస్ట్ ఇదే..
Kolkata Knight Riders Retained and Released Players Full List: అనూహ్యంగా, KKR తమ స్టార్ ఆల్‌రౌండర్‌లైన ఆండ్రీ రస్సెల్ (Andre Russell), వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer)లను విడుదల చేసింది. గతేడాది లోపాలను సరిదిద్దుకునే లక్ష్యంతో KKR ప్రకటించిన పూర్తి జాబితా ఎలా ఉందో ఓసారి చూద్దాం..

Kolkata Knight Riders Retained and Released Players Full List: ఐపీఎల్ 2024 ఛాంపియన్స్ అయినప్పటికీ, ఐపీఎల్ 2025లో నిరాశపరిచిన ప్రదర్శన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు ఐపీఎల్ 2026 కోసం తమ స్క్వాడ్‌ను పునర్నిర్మించేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంది. రిటెన్షన్ విండో ముగియడంతో, KKR తమ విశ్వసనీయ కోర్‌ను నిలబెట్టుకుంటూ, భారీ మార్పులతో ముందుకు వచ్చింది.
అనూహ్యంగా, KKR తమ స్టార్ ఆల్‌రౌండర్‌లైన ఆండ్రీ రస్సెల్ (Andre Russell), వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer)లను విడుదల చేసింది. గతేడాది లోపాలను సరిదిద్దుకునే లక్ష్యంతో KKR ప్రకటించిన పూర్తి జాబితా ఎలా ఉందో ఓసారి చూద్దాం..
టైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా (Retained Players)..
KKR తమ భవిష్యత్తు కోసం, స్థిరమైన ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది:
రింకూ సింగ్ (Rinku Singh)
అజింక్యా రహానే (Ajinkya Rahane)
సునీల్ నరైన్ (Sunil Narine)
వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)
హర్షిత్ రాణా (Harshit Rana)
ఆంగ్క్రిష్ రఘువంశీ (Angkrish Raghuvanshi)
మనీష్ పాండే (Manish Pandey)
రోవ్‌మాన్ పావెల్ (Rovman Powell)
రమణ్‌దీప్ సింగ్ (Ramandeep Singh)
అనుకుల్ రాయ్ (Anukul Roy)
వైభవ్ అరోరా (Vaibhav Arora)
ఉమ్రాన్ మాలిక్ (Umran Malik)
విడుదలైన ఆటగాళ్ల జాబితా (Released Players)..
భారీ మొత్తానికి కొనుగోలు చేసినా, సరిగా రాణించని ఆటగాళ్లను KKR విడుదల చేసింది. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండటం పెద్ద షాక్.
ఆండ్రీ రస్సెల్ (Andre Russell)
వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer)
క్వింటన్ డి కాక్ (Quinton de Kock)
రహమనుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz)
మొయిన్ అలీ (Moeen Ali)
స్పెన్సర్ జాన్సన్ (Spencer Johnson)
ఆన్రిచ్ నోర్ట్జే (Anrich Nortje)
చేతన్ సకారియా (Chetan Sakariya)
లువ్నిత్ సిసోడియా (Luvnith Sisodia)
ట్రేడ్ అయిన ఆటగాడు..
అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) (ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ ద్వారా KKRలోకి వచ్చాడు).
మిగిలిన పర్స్ వివరాలు (Purse Remaining)..
భారీ ధర పలికిన ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్‌లను విడుదల చేయడం ద్వారా KKR తమ వేలం పర్స్‌ను గణనీయంగా పెంచుకుంది.
మిగిలిన పర్స్ (Purse Remaining): రూ. 64.3 కోట్లు
ఖాళీ స్లాట్‌లు (Slots Remaining): 13
(వీటిలో విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు: 6)
KKR తమ పర్స్‌లో ఇంత పెద్ద మొత్తాన్ని ఉంచుకోవడం ద్వారా, ఐపీఎల్ 2026 మినీ-వేలంలో అత్యధిక ఖర్చు చేసే ఫ్రాంఛైజీలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. కొత్త కోచ్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో బలమైన దేశీయ వికెట్ కీపర్-బ్యాటర్, మరియు వేగవంతమైన పేసర్లను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




