IPL 2023: కేకేఆర్ కెప్టెన్సీని నితీశ్ రాణాకు కట్టబెట్టడంలో మర్మమిదే.. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈసారి ఎలాగైనా టైటిల్‌ను దక్కించుకోవాలనుకున్న కోల్‌కతాకు కెప్టెన్సీ రూపంలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. దీంతో జట్టు సారథ్య బాధ్యతలను నితీశ్ రాణాకు అప్పజెప్పారు. కాగా ఈ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో టైటిల్ కోసం 8 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. 2012, 2014లో ఐపీఎల్ టైటిల్‌ను గెల్చుకున్న కోల్‌కతా 2021లో రన్నరప్‌గా నిలిచింది. ఇక గతేడాది లీగ్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఈసారి ఎలాగైనా టైటిల్‌ను దక్కించుకోవాలనుకున్న కోల్‌కతాకు కెప్టెన్సీ రూపంలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. దీంతో జట్టు సారథ్య బాధ్యతలను నితీశ్ రాణాకు అప్పజెప్పారు. కాగా ఈ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. జట్టులో ఎంతోమంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండగా రాణాకే కెప్టెన్సీని ఇవ్వడంపై ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించారు. అలాగే తాజా సీజన్‌లో కేకేఆర్ విజయవకాశాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కెప్టెన్‌గా నితీశ్‌కు మంచి అనుభవం ఉంది. నేషనల్ లెవెల్ క్రికెట్ పోటీల్లో రెండుసార్లు ఢిల్లీ జట్టుకు సారథ్యం వహించాడు. అంతేకాకుండా అతను గత ఐదారేళ్లుగా కోల్‌కతా జట్టుతోనే ఉన్నాడు. తన జట్టులోని ఆటగాళ్లు, వారి బలాలు, బలహీనతలపై అతనికి సంపూర్ణ అవగాహన ఉంది.’
‘ అలాగే ఇతర జట్ల గురించి కూడా నితీశ్‌కు బాగా తెలుసు. ఇక జట్టులో అతనికి చాలా గౌరవముంది. నాయకుడికున్న లక్షణాలన్నీ నితీశ్‌లో ఉన్నాయి. పైగా అతను ఎన్నో సవాళ్లును దాటి ఈ స్థాయికి వచ్చాడు. అందుకే ఫ్రాంఛైజీ అతనిపై నమ్మకముంచింది. నితీశ్ అన్ని అడ్డంకులను అధిగమించి, మంచి కెప్టెన్‌గా నిలుస్తాడన్న నమ్మకం మాకుంది’ అని చెప్పుకొచ్చాడు అభిషేక్ నాయర్. ఇక ఐపీఎల్ 2023లో కోల్‌కతా గేమ్ ప్లాన్స్, విజయవకాశాలపై ఆయన ఏమన్నారో ఈ కింది వీడియోలో చూడండి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..