Vijay Hazare Trophy: ఎట్టకేలకు ఫాంలోకొచ్చినా.. రిజల్ట్‌లో మాత్రం బ్యాడ్‌లక్కే.. శని పూజలు షురూ చేయాలంటోన్న నెటిజన్స్..
Vijay Hazare Trophy 2023: అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించిన సహబ్ యువరాజ్ 136 బంతుల్లో 1 సిక్స్, 13 ఫోర్లతో అజేయంగా 121 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో రైల్వేస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజూ శాంసన్ ఒంటరి పోరాటం చేసినా కేరళ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. చివరకు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసిన కేరళ జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Vijay Hazare Trophy 2023: బెంగళూరులోని కిని స్పోర్ట్స్ ఎరీనాలో జరుగుతున్న విజయ్ హజారే టోర్నమెంట్ రౌండ్ 7 మ్యాచ్‌లో కేరళ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) ఎట్టకేలకు ఫాంలోకి వచ్చాడు. అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. రైల్వేస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కేరళ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
రైల్వేస్ తరపున ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రథమ్ సింగ్ 77 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించిన సహబ్ యువరాజ్ 136 బంతుల్లో 1 సిక్స్, 13 ఫోర్లతో అజేయంగా 121 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో రైల్వేస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.
అనంతరం 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టుకు శుభారంభం లభించలేదు. రోహన్ కున్నుమ్మల్ (0), సచిన్ బేబీ (9), సల్మాన్ నజీర్ (2) వికెట్లను కేవలం 26 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో చేరిన సంజూ శాంసన్, శ్రేయాస్ గోపాల్ మంచి భాగస్వామ్యాన్ని అందించారు. శ్రేయస్ కూడా 63 బంతుల్లో 53 పరుగులు చేసి తన వికెట్‌ను కోల్పోయాడు.
అయితే, ఒంటరి పోరాటం కొనసాగించిన సంజూ శాంసన్ 139 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 128 పరుగులు చేశాడు. అలాగే, 50వ ఓవర్ 5వ బంతికి క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోయాడు.
సంజూ శాంసన్ సెంచరీ..
-When Kerala lost 4 wickets for just 59 runs.☹️
-Captain Sanju Samson Played a brilliant innings in very difficult situation.🔥
-Scored 128 runs off 139 balls with 8 fours and 6 huge Sixes. 🔥
-Very Well Tried Skipper.🔥 #SanjuSamson pic.twitter.com/FFty8fdp0g
— Sanju & Dhoni Official Fan Page (@MeenaRamkishan0) December 5, 2023
సంజూ శాంసన్ ఒంటరి పోరాటం చేసినా కేరళ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. చివరకు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసిన కేరళ జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.
కేరళ ప్లేయింగ్ ఎలెవన్: రోహన్ కున్నుమ్మల్, సచిన్ బేబీ, సంజు శాంసన్ (కెప్టెన్), శ్రేయాస్ గోపాల్, సల్మాన్ నిజార్, కృష్ణ ప్రసాద్, అబ్దుల్ బాసిత్, బాసిల్ థంపి, అఖిన్ సత్తార్, వైశాఖ్ చంద్రన్, అఖిల్ స్కారియా.
రైల్వేస్ ప్లేయింగ్ ఎలెవన్: శివమ్ చౌదరి, వివేక్ సింగ్, ప్రథమ్ సింగ్, భార్గవ్ మెరాయ్, ఉపేంద్ర యాదవ్ (కెప్టెన్), సాహబ్ యువరాజ్, రాహుల్ శర్మ, కర్ణ్ శర్మ, అశుతోష్ శర్మ, రాజ్ చౌదరి, హిమాన్షు సాంగ్వాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




