VHT 2023: 35 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు.. 200లకుపైగా స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రికార్డులు బ్రేక్..
Vijay Hazare Trophy 2023, Jammu and Kashmir vs Karnataka: విజయ్ హజారే ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్‌పై కర్ణాటక జట్టు మొదటి 30 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసింది. అదే 40 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోరు 271కి చేరింది. 50 ఓవర్లు ముగిసే సరికి 402 పరుగులు చేసింది. ఓ యువ ఆటగాడు తన తుఫాన్ బ్యాటింగ్‌తో జట్టు స్కోరును 400 దాటేలా చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కర్ణాటక జట్టు సాధించినదే అత్యధిక స్కోరుగా రికార్డులకు ఎక్కింది.
Vijay Hazare Trophy 2023, Jammu and Kashmir vs Karnataka: దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఈరోజు ప్రారంభమైంది. మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని కర్ణాటక జట్టు జమ్మూకశ్మీర్ జట్టుతో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కర్ణాటక జట్టు సాధించినదే అత్యధిక స్కోరుగా రికార్డులకు ఎక్కింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటకకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రవికుమార్ సమర్థ్, మయాంక్ అగర్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ 38.5 ఓవర్ల వరకు క్రీజులో నిలబడ్డారు. 267 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇద్దరూ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. రవికుమార్ 120 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్ 133 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 157 పరుగులు చేశాడు. 40వ ఓవర్‌కు వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా తుఫాన్ ఆటతో ఆకట్టుకున్నాడు.
పడిక్కల్ కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 71 పరుగులు చేయగా, మనీష్ పాండే 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. నిర్ణీత 50 ఓవర్లలో కర్ణాటక 2 వికెట్ల నష్టానికి 402 పరుగులు చేసింది. విశేషమేమిటంటే తొలి 30 ఓవర్లలో కర్ణాటక జట్టు 193 పరుగులు మాత్రమే చేసింది. అదే 40 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోరు 271కి చేరింది. 50 ఓవర్లు ముగిసే సరికి 402 పరుగులు చేసింది. పడిక్కల్ తుఫాన్ బ్యాటింగ్‌తో జట్టు స్కోరు 400 దాటించాడు.
కర్ణాటక ప్లేయింగ్ ఎలెవన్: రవికుమార్ సమర్థ్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, శరత్ బీఆర్ (వికెట్ కీపర్), నికిన్ జోస్, మనీష్ పాండే, కృష్ణప్ప గౌతమ్, జగదీశ్ సుచిత్, విజయ్ కుమార్ వైషాక్, వాసుకి కౌశిక్, విద్వాత్ కావేరప్ప.
జమ్మూ-కశ్మీర్ ప్లేయింగ్ ఎలెవన్: కమ్రాన్ ఇక్బాల్, శుభమ్ ఖజురియా (కెప్టెన్), ఫాజిల్ రషీద్ (వికెట్ కీపర్), హెనాన్ నజీర్ మాలిక్, అబ్దుల్ సమద్, వివ్రాంత్ శర్మ, రసిఖ్ దార్ సలామ్, యుధ్వీర్ సింగ్ చరక్, సాహిల్ లోథ్రా, అబిద్ ముస్తాక్, ఉమ్రాన్ మాలిక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..