IPL 2025: సింపుల్ గా మూడుముక్కలతో CSK లెజెండ్ భవిష్యత్ తేల్చేసిన హెడ్ కోచ్! డెఫినెట్లీ ఆడుతాడా మరీ?
CSK ప్రస్తుత ప్రదర్శన నిరాశ కలిగించిన నేపథ్యంలో, హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన యువతపై దృష్టి సారిస్తున్నట్లు, అనుభవం కూడా తప్పనిసరి అనే దృష్టితో మాట్లాడారు. ధోనీ భవిష్యత్తుపై మాత్రం స్పష్టంగా స్పందించకపోయినా, మూడు పదాల్లో బదులిచ్చారు. CSK ఇప్పుడు వచ్చే మూడు సంవత్సరాల ప్రణాళికలో యువ ఆటగాళ్లతో ముందుకెళ్లే ఆలోచనలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుత సీజన్‌లో నిరాశజనక ప్రదర్శన తర్వాత ఐపీఎల్‌లో తమ భవిష్యత్తు దిశగా పయనిస్తున్న సందర్భంలో, ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇచ్చిన సమాధానాలు అభిమానుల్లో కొత్త చర్చలకు దారి తీశాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు తమ జట్టును ఎలా పునర్నిర్మించుకోవాలో శ్రద్ధగా పరిశీలిస్తున్నామని చెప్పిన ఫ్లెమింగ్, యువతను నమ్మినప్పటికీ అనుభవం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. “అనుభవం టోర్నమెంట్లు గెలిపిస్తుంది” అనే మాటలతో అతను చెప్పిన దృష్టికోణం స్పష్టమైంది. గత సీజన్‌లో సిఎస్‌కె విజయవంతంగా నిలబడినప్పటికీ, ఈ సారి ప్రదర్శన తక్కువగానే ఉందని, యువ ఆటగాళ్లపై ఆధారపడే సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్ లాంటి యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శనతో తమను ఆకట్టుకున్నారని, భవిష్యత్‌లో వారి పాత్ర మరింత పెరుగుతుందని చెప్పారు. సీజన్ మొత్తం అనుభవజ్ఞులపై ఆధారపడటం విఫలమవడంతో వచ్చే మూడు సంవత్సరాల ప్రణాళికలో యువతను ముందుకు తీసుకెళ్లే దిశగా ఆలోచనలు కొనసాగుతున్నాయని ఫ్లెమింగ్ వివరించారు.
ఆటగాళ్ల వయస్సు కన్నా వారి ప్రదర్శనే ముఖ్యం అనే అభిప్రాయాన్ని ఫ్లెమింగ్ స్పష్టం చేశారు. “గత సంవత్సరాల్లో అనుభవం మాకు విజయాన్ని ఇచ్చింది. కానీ ఈసారి అంతగా పనిచేయలేదు. ఫ్రాంచైజీలు ఎలా పనిచేస్తున్నాయో చూస్తే, ఇది సాధారణమే” అని పేర్కొన్నారు. టోర్నమెంట్ చివర్లో జట్టుకు మిగిలిన ప్రేరణ ఏమిటని అడిగినపుడు, “CSK తరపున బలంగా ముగించేందుకు మాకు ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయి. ప్రతి మ్యాచ్ మా గౌరవానికి ప్రతీకగా ఉంటుంది. ఆటగాళ్ల ప్రదర్శనపై ఆత్మవిశ్వాసం పెంచుకోవడమే ప్రస్తుత ధ్యేయం” అని ఫ్లెమింగ్ స్పష్టం చేశారు. అలాగే, ప్లే-ఆఫ్స్ రేసు నుండి తప్పుకున్న తర్వాత జట్టులోని ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. గత రెండు మూడు మ్యాచ్‌ల్లో అది ప్రయత్నించినట్లు, మిగిలిన మ్యాచ్‌ల్లోనూ అదే దిశలో కొనసాగుతామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోని భవిష్యత్తుపై మాత్రం ఫ్లెమింగ్ మూడు పదాల ఐ డోంట్ నో(నాకు తెలీదు) అనే సమాధానంతో మౌనాన్ని వీడారు. అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ధోనిని ఐపీఎల్‌లో చూడటం అలవాటైపోయింది. అయితే ఈసారి మాత్రం ధోని భవిష్యత్తు తేటతెల్లం కావడం ఆలస్యమవుతోంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సీఎస్‌కే అతన్ని అన్‌క్యాప్డ్ కేటగిరీలో రూ.4 కోట్లకు నిలుపుకుంది. మోచేయి గాయం కారణంగా కెప్టెన్సీకి దూరమైన రుతురాజ్ గైక్వాడ్‌కు బదులుగా ధోని మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కానీ 7 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు సాధించగలిగిన సీఎస్‌కే చివరి స్థానానికి చేరడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



