Video: వేలంలో హేళన చేసిన కోహ్లీ టీం.. కట్‌చేస్తే.. 6 బంతుల్లో 3 వికెట్లతో స్ట్రాంగ్ కౌంటరిచ్చిన మాజీ ఆర్‌సీబీ ప్లేయర్
Australia vs Pakistan 3rd Test: సిడ్నీ టెస్టు మూడో రోజునే పాకిస్థాన్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ జట్టు కేవలం 68 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా కంటే కేవలం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. పాకిస్థాన్ ఈ పరిస్థితికి కారణమైన ఆటగాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుండి మొదట తొలగించబడ్డాడు మరియు వేలంలో అతని పేరు వచ్చినప్పుడు చేతులు ముడుచుకున్నాడు.
Josh Hazlewood Video: ఓ వైపు దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ చరిత్ర సృష్టించగా, మరోవైపు ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ జట్టు చెత్త రికార్డులను నమోదు చేస్తోంది. పెర్త్, మెల్‌బోర్న్‌లలో ఓటమి తర్వాత, ఇప్పుడు సిడ్నీలో కూడా పాక్ జట్టు ఓటమి అంచున నిలిచింది. ప్రస్తుతం ఆ జట్టుకు క్లీన్ స్వీప్ ముప్పు పొంచి ఉంది. సిడ్నీ టెస్ట్ మూడో రోజు పాకిస్థాన్‌లో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే.. క్లీన్ స్వీప్ తప్పేలా లేదనిపిస్తోంది. పాక్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్స్ పేలవ ప్రదర్శన చేయడంతో ఇప్పుడు ఓటమికి చేరువైంది. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 68 పరుగులకే 7 బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయింది. ఈ పరిస్థితికి కారణం ఆస్ట్రేలియార పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్.
హాజెల్‌వుడ్ వినాశనం..
జోష్ హేజిల్‌వుడ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 బంతుల్లోనే పాకిస్థాన్ పరిస్థితిని చెడగొట్టాడు. 25వ ఓవర్లో జోష్ హేజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. హాజిల్‌వుడ్ మొదట సౌద్ షకీల్‌ను స్టీవ్ స్మిత్ క్యాచ్ అవుట్ చేశాడు. 2 బంతుల తర్వాత, అతను సాజిద్ ఖాన్ వికెట్ తీసుకున్నాడు. 2 బంతుల తర్వాత, ఆఘా సల్మాన్‌ను అవుట్ చేయడం ద్వారా పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్‌ను నాశనం చేశాడు. హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్ కూడా మెయిడిన్ కావడం గమనార్హం. ఒకానొక సమయంలో పాకిస్తాన్ స్కోరు 2 వికెట్లకు 58 పరుగులుగా నిలిచింది. అయితే, 67 పరుగులకు చేరుకునే సమయానికి, పాక్ ఆటగాళ్లలో మరో 5 మంది పెవిలియన్‌కు తిరిగి వెళ్లారు.
"The nightwatchman plan is a complete failure!"#AUSvPAK pic.twitter.com/EAkOeSDg4b
— cricket.com.au (@cricketcomau) January 5, 2024
బదులిచ్చిన హేజిల్‌వుడ్..
హేజిల్‌వుడ్ తన ఈ ప్రదర్శన అతని విమర్శకులకు సమాధానంగాన నిలిచింది. ముఖ్యంగా ఐపీఎల్ టీమ్ ఆర్‌సీబీ, అతడిని మొదట జట్టు నుంచి తప్పించింది. ఆపై వేలంలో ఆర్‌సీబీ యాజమాన్యం చేసిన పని హేజిల్‌వుడ్ అభిమానులకు కోపం తెప్పించింది.
RCB reaction when asked about Josh Hazlewood. pic.twitter.com/Iomybm6I4N
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2023
ఐపీఎల్ 2024 (IPL 2024) వేలంలో హేజిల్‌వుడ్ పేరు వచ్చిన సమయంలో RCB తరపున వేలంలో పాల్గొన్న వారు చేతులు జోడించారు. ఈ ఫొటో కాస్త వైరల్ అయింది. హాజిల్‌వుడ్‌పై ఏ ఐపీఎల్ జట్టు పందెం వేయలేదు. ఎందుకంటే అతను ఐపీఎల్ సీజన్‌లో సగం వరకు అందుబాటులో ఉండడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..