IPL 2023: ముంబై ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయంతో దూరమైన స్టార్ ప్లేయర్?
స్నాయువు గాయం కారణంగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఝే రిచర్డ్‌సన్ త్వరలో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో భాగమయ్యాడు.
Jhye Richardson Injury: IPL 2023కి ముందు ముంబై ఇండియన్స్‌కి బ్యాడ్ న్యూస్ అందింద. ముంబై జట్టులోని ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ఝే రిచర్డ్‌సన్ మళ్లీ గాయపడ్డాడు. అతను IPL వరకు గాయం నుంచి కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 2022లో జరిగిన వేలంలో జే రిచర్డ్‌సన్‌ను ముంబై ఫ్రాంచైజీ రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసింది.
ఝే రిచర్డ్‌సన్ స్నాయువు గాయంతో పోరాడుతున్నాడు. బిగ్ బాష్ లీగ్ (BBL) సమయంలో రిచర్డ్‌సన్ ఈ గాయానికి గురయ్యాడు. జనవరి 4 నుంచి అతను ఈ గాయం కారణంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. గత శనివారం తిరిగి వచ్చినా మళ్లీ మైదానం వీడాల్సి వచ్చింది. రిచర్డ్‌సన్ గాయం కారణంగా రెండు నెలల పాటు మైదానానికి దూరంగా ఉన్న తర్వాత గత శనివారం తన క్రికెట్ క్లబ్ ఫ్రీమాంటిల్ కోసం బరిలోకి దిగాడు. ఇక్కడ అతను 50 ఓవర్ల మ్యాచ్‌లో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేయగలిగాడు. అతను బౌలింగ్ చేయడంలో ఇబ్బందిగా ఫీలయ్యాడు. అతను వెంటనే స్కాన్ కోసం వెళ్లాడు. ఆ తరువాత, వైద్య పరీక్షలో మరోసారి అతని స్నాయువు గాయం తెరపైకి వచ్చింది. అతనికి కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
5 సంవత్సరాలలో 38 అంతర్జాతీయ మ్యాచ్‌లు..
రిచర్డ్‌సన్ 2017 సంవత్సరంలోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే ఆ తర్వాత 2019లో భుజం గాయం కారణంగా చాలా కాలం పాటు ఆస్ట్రేలియా జట్టుకు దూరంగా ఉన్నాడు. 26 ఏళ్ల ఈ ఆటగాడు ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున మూడు ఫార్మాట్లలో మొత్తం 36 మ్యాచ్‌లు ఆడాడు. అతని పేరిట మొత్తం 57 వికెట్లు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..