Video: సెలెక్టర్లు ఛీ కొట్టారు.. జట్టు నుంచి తప్పించారు.. కట్‌చేస్తే.. తుఫాన్ ఆటతో నోరు మూయించాడుగా
ఓ తప్పు చేయడంతో భారత జట్టు నుంచి దూరమయ్యాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి, అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. ఆయనెవరో కాదు.. యువ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్. ఇప్పుడు తన అద్భుత ఆటతీరుతో మళ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రస్తుతం తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ కిషన్..

ఓ తప్పు చేయడంతో భారత జట్టు నుంచి దూరమయ్యాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి, అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. ఆయనెవరో కాదు.. యువ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్. ఇప్పుడు తన అద్భుత ఆటతీరుతో మళ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రస్తుతం తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ కిషన్.. మధ్యప్రదేశ్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్.. రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ విజయానికి 138 పరుగులు చేయాల్సి ఉంది. చివర్లో ఇషాన్ కిషన్ రెండు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు.
ఇండియాలో స్థానంపై గురి..
దీంతో పాటు ఇషాన్ కిషన్ టీమ్ ఇండియాలో స్థానంపై గురిపెట్టాడు. దులీప్ ట్రోఫీలో కిషన్ తన ప్రదర్శనను కొనసాగిస్తే బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో అతనికి చోటు దక్కడం ఖాయం. ఈ మ్యాచ్‌లో తన ఆటతీరుతో విమర్శకులందరి నోరు మూయించాడు కిషన్. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్‌లో మూడు అద్భుత క్యాచ్‌లు అందుకున్న కిషన్ కూడా సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ జార్ఖండ్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 41 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
Ishan Kishan – the hero of Jharkhand !!!
– Jharkhand needed 12 with 2 wickets in hands, captain smashed 6,0,6 to seal the game. pic.twitter.com/3uTqFF1KI2
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2024
తుఫాన్ ప్రదర్శనతో బంగ్లాతో సిరీస్‌కి ఎంపికయ్యే ఛాన్స్..
ఈ తుఫాన్ ప్రదర్శనతో ఇషాన్ కిషన్.. వచ్చే నెల నుంచి మొదలుకానున్న బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ సిరీస్‌కు ఇంకా భారత జట్టును ఎంపిక చేయలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
