Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishan Kishan: ‘నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు.. దేశవాళీలో ఆడడం వేస్ట్’: ఎట్టకేలకు మౌనం వీడిన ఇషాన్ కిషన్..

Ishan Kishan: వాస్తవానికి దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టులో ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. కానీ, కిషన్ అకస్మాత్తుగా జట్టును వదిలి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత దీనిపై చాలా ఊహాగానాలు వచ్చాయి. తర్వాత, అప్పటి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కిషన్‌తో మాట్లాడుతూ, అతను మళ్లీ భారత జట్టులో చేరాలనుకుంటే, దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. అలాగే, బోర్డు నిబంధనలను పాటించాలని కిషన్‌ను బీసీసీఐ హెచ్చరించింది.

Ishan Kishan: 'నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు.. దేశవాళీలో ఆడడం వేస్ట్': ఎట్టకేలకు మౌనం వీడిన ఇషాన్ కిషన్..
Ishan Kisan
Venkata Chari
|

Updated on: Jul 08, 2024 | 9:14 PM

Share

Ishan Kishan: దక్షిణాఫ్రికా పర్యటనను సగానికి ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్.. ప్రస్తుతం టీమ్ ఇండియాలో అవకాశం కోసం చూస్తున్నాడు. 2023-24లో దక్షిణాఫ్రికా పర్యటనలో చివరిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్.. చేసిన ఓ చిన్న పొరపాటుతో ఇప్పుడు జట్టులో అవకాశం దక్కడంపై సందేహం నెలకొంటోంది. ఒకానొక సమయంలో భారత జట్టుకు కాబోయే సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఇషాన్ కిషన్.. బీసీసీఐ ఇచ్చిన సూచనలకు విలువ ఇవ్వలేదు. జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇచ్చిన సలహాను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బయటపడ్డ ఇషాన్ కిషన్.. చాలా కాలం తర్వాత ఇప్పుడు మౌనం వీడాడు.

దేశవాళీ క్రికెట్ ఆడని కిషన్..

వాస్తవానికి దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టులో ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. కానీ, కిషన్ అకస్మాత్తుగా జట్టును వదిలి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత దీనిపై చాలా ఊహాగానాలు వచ్చాయి. తర్వాత, అప్పటి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కిషన్‌తో మాట్లాడుతూ, అతను మళ్లీ భారత జట్టులో చేరాలనుకుంటే, దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. అలాగే, బోర్డు నిబంధనలను పాటించాలని కిషన్‌ను బీసీసీఐ హెచ్చరించింది. కానీ కిషన్ దేశవాళీ క్రికెట్ కూడా ఆడలేదు. బీసీసీఐ సూచనలను పాటించలేదు. ఫలితంగా, అతను సెంట్రల్ కాంట్రాక్ట్‌తో పాటు టీమ్ ఇండియా నుంచి తప్పించారు.

ఇదేం రూలో అర్ధం కాలేదు..

ఈ ఘటనపై ఇప్పుడు పెదవి విరిచిన కిషన్.. ‘అవును.. బ్రేక్ తీసుకున్నాను. క్రికెట్‌లో ఇలాంటివి సర్వసాధారణమని నేను భావిస్తున్నాను. జట్టులో పునరాగమనం చేయాలంటే దేశవాళీ క్రికెట్‌లో రాణించాలన్నది నిబంధన. దేశవాళీ క్రికెట్ ఆడటం నాకు చాలా భిన్నంగా ఉండేది. ఎందుకంటే దానికి అర్థం లేదు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో నేను బాగా రాణిస్తున్నాను. కాబట్టి నేను ఆడాలని అనుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

నాకు నచ్చలేదు..

భారత జట్టు నుంచి తొలగించడం, సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి మినహాయించడం గురించి ఇషాన్ మాట్లాడుతూ, ‘ఇది నాకు చాలా నిరాశపరిచింది. అంతా బాగుందని చెప్పలేను. ఆ సమయం నాకు మంచిది కాదు. నాకే ఎందుకు ఇలా జరిగింది? అప్పుడు ఏం జరిగిందో నా మనసులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నప్పుడు ఇదంతా జరగడం బాధాకరం. ప్రయాణంలో అలసిపోయేవాడిని. ఆ సమయంలో నాకు బాగోలేదు. దాని కోసం దక్షిణాఫ్రికా టూర్‌కు విరామం ఇచ్చి భారత్‌కు తిరిగొచ్చాను. కానీ, నా కుటుంబం, సన్నిహితులు తప్ప ఎవరూ నన్ను అర్థం చేసుకోలేదని నేను బాధపడ్డాను అంటూ పెదవి విప్పాడు.

నా కుటుంబం నాకు మద్దతుగా నిలిచింది..

కానీ, నాకు విరామం దొరికినప్పుడు మా కుటుంబం నన్ను ఆదరించింది. ఒక ఆటగాడు బయటి వ్యక్తులు చెప్పేదానిని తట్టుకోగలరు. కానీ తల్లిదండ్రులు దానిని ఎలా తీసుకుంటారు. వాళ్లు ఒత్తిడికి గురవుతారు. కానీ ఆ సమయంలో మా కుటుంబ సభ్యులు నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు, నా నిర్ణయాలకు మద్దతు ఇచ్చారు. నాకు బాగా లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. కాబట్టి నా నిర్ణయాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు. నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..