Tanya Singh: మోడల్ ఆత్మహత్య కేసులో విచారణకు ఎస్‌ఆర్‌హెచ్ ఆల్ రౌండర్.. ఆ ఫొటోలపైనే కీలక ప్రశ్నలు..
Abhishek Sharma: అభిషేక్ తనకు, తానియా సింగ్ సంబంధానికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నలు అడిగారు. తానియాతో ఎలా పరిచయం ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, ఎలా పరిచయం జరిగిందనే ప్రశ్నలు అడిగారు. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? తానియా, అభిషేక్ కలిసి ఉన్న ఫొటోల గురించి కూడా ప్రశ్నలు అడిగారు.

Model Suicide Case Update: సూరత్ మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో స్థానిక పోలీసులు మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మను 5 గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా ఇద్దరి ఫొటోలకు సంబంధించిన ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. 23 ఏళ్ల అభిషేక్ తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఉదయం వేసు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ‘పోలీసులు నన్ను పిలిచారు. నేను నా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
మూలాల ప్రకారం, అభిషేక్ మధ్యాహ్నం 1 గంటలకు వేసు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సాయంత్రం వరకు ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయనకు పలు రకాల ప్రశ్నలు సంధించారు. ఫిబ్రవరి 19 రాత్రి సూరత్ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ తానియా సింగ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
వారి సంబంధంపై ప్రశ్నలు..
అభిషేక్ తనకు, తానియా సింగ్ సంబంధానికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నలు అడిగారు. తానియాతో ఎలా పరిచయం ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, ఎలా పరిచయం జరిగిందనే ప్రశ్నలు అడిగారు. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? తానియా, అభిషేక్ కలిసి ఉన్న ఫొటోల గురించి కూడా ప్రశ్నలు అడిగారు.
తానియా ఫోన్‌లో అభిషేక్‌తో జరిగిన చాట్ సంభాషణపై పోలీసులు దర్యాప్తు..
తానియా ఫోన్‌ను విచారించిన తర్వాత, ఆమెకు అభిషేక్‌కి మధ్య ఉన్న సంబంధం గురించి పోలీసులకు తెలిసిందని దర్యాప్తులో తేలింది. అభిషేక్ శర్మకు ఒక పార్టీ అతని ఫొన్ నుంచి సందేశం పంపినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఐపీఎల్ ప్లేయర్‌కు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు.
రంజీ మ్యాచ్‌లో కలిశాం..
28 ఏళ్ల తానియా సింగ్ ఫ్యాషన్ డిజైన్‌తో పాటు మోడలింగ్‌తో సంబంధం కలిగి ఉంది. లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో జరిగిన రంజీ మ్యాచ్‌లో అభిషేక్‌తో ఆమె మొదటి సమావేశం జరిగింది. తానియా సింగ్, అభిషేక్ శర్మలు ఏడాది క్రితం విడిపోయారు. ఇద్దరూ ఒక సంవత్సరం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. బ్రేకప్ తర్వాత తానియా అభిషేక్‌కి చాలా మెసేజ్‌లు పంపగా, అభిషేక్ స్పందించలేదు.
అభిషేక్ శర్మ ఎవరు?
అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్. అతను 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలతో 30.60 సగటు, 1071 పరుగులు చేశాడు. 88 టీ20ల్లో అతను 145 స్ట్రైక్ రేట్‌తో 2187 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పంజాబ్ తరపున ఆడుతున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో పంజాబ్‌కు ఆడుతున్నప్పుడు తమిళనాడుపై ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..