Team India: 140 మ్యాచ్‌ల్లో 542 వికెట్లు.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్ ప్రకటించిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.. ఎందుకంటే?
Shahbaz Nadeem Retirement: భారత్ తరపున రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడి ఫస్ట్ క్లాస్‌లో 542 వికెట్లు తీసిన ప్లేయర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యువతకు అవకాశం కల్పించాలని ఈ మేరకు సూచించాడు. ఈ బౌలర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 140 మ్యాచ్‌ల్లో 542 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. నదీమ్ కూడా 134 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఫార్మాట్‌లో 175 వికెట్లు పడగొట్టాడు.

Shahbaz Nadeem Retirement: జార్ఖండ్ ప్రముఖ స్పిన్నర్, టీమ్ ఇండియాలో ఒక భాగమైన షాబాజ్ నదీమ్.. అంతర్జాతీయ , ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ భారత్ తరపున 2 టెస్టులు ఆడాడు. కానీ, ఆ తర్వాత అతనికి టీమ్ ఇండియాలో అవకాశం రాలేదు. ఈ బౌలర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 140 మ్యాచ్‌ల్లో 542 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. నదీమ్ కూడా 134 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఫార్మాట్‌లో 175 వికెట్లు పడగొట్టాడు. ఈ బౌలర్ రాజస్థాన్‌పై కొత్త రికార్డు సృష్టించాడు. ఫార్మాట్‌లో 10 పరుగులకు 8 వికెట్లు తీసుకున్నాడు. 34 ఏళ్ల ఆటగాడి మదిలో కొంతకాలంగా రిటైర్మెంట్ చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు భారత జట్టుకు ఆడే అవకాశాలు దాదాపు ముగిసిపోవడంతో యువ ఆటగాళ్లకు చోటు కల్పించాలనుకుంటున్నట్లు స్పిన్నర్ తెలిపాడు.
ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫోతో నదీమ్ మాట్లాడుతూ, “నేను చాలా కాలంగా నా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను మూడు ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అవుతున్నానని నిర్ణయించుకున్నాను. మీకు కొంత ప్రేరణ ఉన్నప్పుడు, మీరు మంచి పనితీరును కనబరుస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు నాకు భారత జట్టులో అవకాశం రాదని తెలుసు. కాబట్టి యువ క్రికెటర్లకు అవకాశాలు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో కూడా ఆడాలని ప్లాన్ చేస్తున్నాను.
స్పిన్నర్ 2019లో రాంచీలో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం చేశాడు. భారతదేశం తరపున రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 4/40 గణాంకాలను నమోదు చేశాడు. 2021లో చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున అతని చివరి మ్యాచ్ ఆడాడు. అతను టెస్టులో 59 ఓవర్లు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
కెరీర్..
ఈ బౌలర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున IPL అరంగేట్రం చేశాడు. 72 మ్యాచ్‌లు ఆడాడు. 2011లో అతని ప్రదర్శనలకు IPL రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతూ 48 వికెట్లు కూడా తీశాడు. రంజీ ట్రోఫీలో, నదీమ్ 2015–16, 2016 -17లో రెండు సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పుడు జార్ఖండ్ తరపున ఫస్ట్-క్లాస్ ఫార్మాట్‌లో 416 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
విదేశీ లీగ్‌లపై కన్నేసిన బౌలర్..
IPL 2024 వేలంలో నదీమ్‌ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఈ ప్లేయర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నదీమ్.. యువతకు బాటలు వేయాలనుకుంటున్నానని, ఇప్పుడు తన దృష్టి అంతా విదేశీ టీ20 లీగ్‌లలో ఆడటంపైనే ఉందని చెబుతున్నాడు. ఈ ఆటగాడు రాజస్థాన్‌తో జరిగిన రంజీ ట్రోఫీ 2024లో తన చివరి మ్యాచ్ ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








