KKR vs DC IPL Match Result: టాస్ ఓడినా అదరగొట్టిన ఢిల్లీ.. కోల్‌కతాపై 44 పరుగుల తేడాతో ఘన విజయం..

216 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 19.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

KKR vs DC IPL Match Result: టాస్ ఓడినా అదరగొట్టిన ఢిల్లీ.. కోల్‌కతాపై 44 పరుగుల తేడాతో ఘన విజయం..
Kkr Vs Dc Ipl Match Result
Follow us
Venkata Chari

|

Updated on: Apr 10, 2022 | 7:58 PM

KKR vs DC IPL Match Result: ఐపీఎల్‌లో ఈరోజు డబుల్ హెడర్ డే. తొలి మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) టీం ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)తో తలపడింది. 216 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 19.4 ఓవర్లలో కేవలం 171 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అది కూడా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. కోల్‌కతా తరపున సారథి శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) 4, ఖలీల్ అహ్మద్ 3, లలిత్ యాదవ్ ఒక వికెట్, శార్దుల్ 2 వికెట్లు దక్కించుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 61 పరుగులు చేయగా, పృథ్వీ షా 51 పరుగులతో ఆకట్టుకున్నారు. కేకేఆర్ ఖాతాలో సునీల్ నరైన్ 2 వికెట్లు పడగొట్టాడు. డేవిడ్ వార్నర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 35 బంతుల్లో ఐపీఎల్‌లో 51వ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మైదానంలోని ప్రతి మూలలోనూ పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో రెండో మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ 45 బంతుల్లో 61 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

3 వికెట్లు 13 పరుగుల వ్యవధిలో..

ఢిల్లీ కేవలం 13 పరుగుల వ్యవధిలో రెండో, మూడు, నాలుగో వికెట్లు కోల్పోయింది. రస్సెల్ ఖాతాలో రిషబ్ పంత్ (27) వికెట్ పడింది. లలిత్ యాదవ్ (1)ని నరైన్ ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేయగా, రోవ్‌మన్ పావెల్ (8) వికెట్ కూడా నరైన్ తీశాడు.

షా అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ మైదానంలోకి రాగానే ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. వార్నర్, పంత్ రెండో వికెట్‌కు 27 బంతుల్లో 54 పరుగులు జోడించారు. రిషబ్ 14 బంతుల్లో 27 పరుగులు చేసి ఆండ్రీ రస్సెల్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో, అతను 2 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

షా వరుసగా రెండో హాఫ్ సెంచరీ..

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే అర్ధసెంచరీ చేసిన తర్వాతే వికెట్ కోల్పోయాడు. పృథ్వీని వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌పై షాకు ఇది ఐదో అర్ధ సెంచరీ. ఈ మ్యాచ్‌లో తొలి సిక్స్ కొట్టడంతో పాటు ఐపీఎల్‌లో షా తన 50 సిక్సర్లను కూడా పూర్తి చేసుకున్నాడు. లక్నోతో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ షా 61 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో ఢిల్లీ తరపున 1,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా పృథ్వీ షా నిలిచాడు. అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ (1250) ఉన్నాడు.

షా, వార్నర్‌ జోడీ..

పృథ్వీ షా, డేవిడ్ వార్నర్‌లు తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. ఈ జోడీ నిరంతరం KKR బౌలర్లపై ఒత్తిడి పెంచింది. ఈ భాగస్వామ్యాన్ని వరుణ్ చక్రవర్తి షా క్లీన్ బౌల్డ్ చేశాడు. పృథ్వీ షా 29 బంతుల్లో 51 పరుగులు చేసి ఔటయ్యాడు.

రెండు జట్లకు చెందిన ప్లేయింగ్ XI..

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(కీపర్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి

Also Read: RR vs LSG Live Score, IPL 2022: పవర్ ప్లేలో అదరగొడుతోన్న పడిక్కల్, బట్లర్.. స్కోరెంతంటే?

IPL 2022: కోల్‌కతాపై మరోసారి మెరుపులు.. పృథ్వీ షా తుఫాన్ బ్యాటింగ్‌తో మారిన లెక్కలు.. సెహ్వాగ్‌‌తో సమానంగా..