RR vs LSG: మెరుపు ఇన్సింగ్స్ ఆడిన హెట్మెయర్.. 4 వికెట్లతో సత్తా చాటిన చాహల్..
ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని వాఖండే స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్(RR), లక్నో సూపర్ జెయింట్స్(LGS) మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నోపై 3 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది...
ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని వాఖండే స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్(RR), లక్నో సూపర్ జెయింట్స్(LGS) మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నోపై 3 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కష్టాల్లో ఉన్న జట్టును శిమ్రన్ హెట్మేయర్ 36 బంతుల్లో 59(ఆరు సిక్స్‌లు, ఒక ఫోర్) పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. పడిక్కల్ 29 బంతుల్లో 29(4 ఫోర్లు), అశ్విన్ 23 బంతుల్లో (2 సిక్స్‌లు), బట్లర్ 13, సంశన్13, డుస్సెన్ 4, పరాగ్ 8, బౌల్ట్ 2 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో హోల్డర్, గౌతమ్ రెండేసి వికెట్లు, అవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.
166 పరుగుల లక్ష్యం ఛేదన మొదలు పెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే కృష్ణప్ప గౌతమ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో లక్నో 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 14 పరుగుల వద్ద హోల్డర్ ఔటయ్యాడు. దీంతో 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లక్నోను డికాక్, దీపక్ హుడా ఆదుకునే ప్రయత్నం చేశారు. 25 పరుగులు చేసిన దీపక్ హుడా కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బధోనీ కూడా త్వరగా ఔటయ్యాడు. దీంతో క్రునాల్ పాండ్యా సహాయంతో లక్నో ఆదుకునే ప్రయత్నం చేశాడు డికాక్. కానీ చాహల్ వేసిన 16 ఓవర్‌లో 32 బంతుల్లో (2 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేసిన డికాక్ ఔట్ అయ్యాడు. అదే ఔవర్‌లో 22 పరుగులు చేసిన క్రునాల్ పాండ్యా బౌల్డ్ అయ్యాడు.
రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు, ట్రెంట్ బౌల్డ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ సేన్ ఒక్కో వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్ 2022లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్ రాయల్స్ మూడింటిలో గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడింది. లక్నో సూపర్ జెయింట్స్ ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ తన తర్వాతి మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఆడనుంది. రాజస్తాన్ రాయల్స్ ఏప్రిల్ 14 గుజరాత్ టైటాన్స్ పోటీ పడనుంది.
Read Also.. KKR vs DC IPL Match Result: టాస్ ఓడినా అదరగొట్టిన ఢిల్లీ.. కోల్‌కతాపై 44 పరుగుల తేడాతో ఘన విజయం..