IPL 2026 Schedule : ప్లేఆఫ్స్ వేట మొదలైంది.. ఐపీఎల్ 2026లో ఏ టీమ్ ఎప్పుడు ఎక్కడ తలపడనుందో తెలుసా ?
IPL 2026 Schedule : గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన కలల టైటిల్‌ను గెలుచుకుని, డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ ఐపీఎల్ 2026 బరిలోకి దిగుతోంది. మార్చి 28 నుంచి ఈ క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. ప్రస్తుతం బీసీసీఐ కేవలం మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే రిలీజ్ చేసింది.

IPL 2026 Schedule : ఐపీఎల్.. ఈ పేరు వింటేనే క్రికెట్ అభిమానుల్లో పూనకాలు వస్తాయి. దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ క్యాష్ రిచ్ లీగ్, ఇప్పుడు సరికొత్త సీజన్‌తో మన ముందుకు వచ్చేసింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.. గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన కలల టైటిల్‌ను గెలుచుకుని, డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ ఐపీఎల్ 2026 బరిలోకి దిగుతోంది. మార్చి 28 నుంచి ఈ క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. ప్రస్తుతం బీసీసీఐ కేవలం మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది. మిగిలిన 54 మ్యాచ్‌ల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్
ఐపీఎల్ 2026 సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. మార్చి 28న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. గత సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ విజేతగా నిలవడంతో, సంప్రదాయం ప్రకారం వారి హోమ్ గ్రౌండ్‌లోనే ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్ల అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు.
ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్
మార్చి 28 – RCB vs SRH – బెంగళూరు
మార్చి 29 – MI vs KKR – ముంబై
మార్చి 30 – RR vs CSK – గౌహతి
మార్చి 31 – PBKS vs GT – న్యూ చండీగఢ్
ఏప్రిల్ 1 – LSG vs DC – లక్నో
ఏప్రిల్ 2 – KKR vs SRH – కోల్‌కతా
ఏప్రిల్ 3 – CSK vs PBKS – చెన్నై
ఏప్రిల్ 4 – DC vs MI – ఢిల్లీ
ఏప్రిల్ 4 – GT vs RR – అహ్మదాబాద్
ఏప్రిల్ 5 – SRH vs LSG – హైదరాబాద్
ఏప్రిల్ 5 – RCB vs CSK – బెంగళూరు
ఏప్రిల్ 6 – KKR vs PBKS – కోల్‌కతా
ఏప్రిల్ 7 – RR vs MI – గౌహతి
ఏప్రిల్ 8 – DC vs GT – ఢిల్లీ
ఏప్రిల్ 9 – KKR vs LSG – కోల్‌కతా
ఏప్రిల్ 10 – RR vs RCB – గౌహతి
ఏప్రిల్ 11 – PBKS vs SRH – న్యూ చండీగఢ్
ఏప్రిల్ 11 – CSK vs DC – చెన్నై
ఏప్రిల్ 12 – LSG vs GT – లక్నో
ఏప్రిల్ 12 – MI vs RCB – ముంబై
ఈ షెడ్యూల్ చూస్తుంటే ఆదివారాల్లో డబుల్ హెడర్ (రోజుకు రెండు మ్యాచ్‌లు) మజా కూడా ఫ్యాన్స్‌కు లభించనుంది.
ప్లేఆఫ్స్, ఫైనల్ వేదిక
రిపోర్టుల ప్రకారం, ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ మే 31న జరిగే అవకాశం ఉంది. ఈసారి ఫైనల్ పోరు కూడా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. మొత్తం 10 జట్లు లీగ్ స్టేజ్ లో ఒక్కోటి 14 మ్యాచ్‌లు ఆడతాయి. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్ (క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2) ఆడుతాయి. ఈ ఫార్మాట్‌లో ఎటువంటి మార్పులు చేయడం లేదని సమాచారం. మిగిలిన 54 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఇదే వారంలో ప్రకటించనున్నారు.
హోమ్ గ్రౌండ్స్ , వేదికలు
ఈసారి కొన్ని జట్లు తమ హోమ్ మ్యాచ్‌లను ప్రత్యామ్నాయ వేదికలపై ఆడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తన మొదటి కొన్ని మ్యాచ్‌లను గువాహటిలో ఆడుతుండగా, పంజాబ్ కింగ్స్ న్యూ చండీగఢ్‌ను తన అడ్డాగా మార్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తన హోమ్ మ్యాచ్‌లను అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడనుంది. ప్రతి జట్టుకు 7 హోమ్ మ్యాచ్‌లు, 7 ఎవే మ్యాచ్‌లు ఉంటాయి. ఆటగాళ్ల ఫామ్, టీమ్ స్ట్రాటజీలను బట్టి ఈసారి టైటిల్ పోరులో ఎవరు నిలుస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
