
RCB vs SRH: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న IPL 2026 సీజన్ రేపట నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే మాజీ ఛాంపియన్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడటం లీగ్‌పై అంచనాలను పెంచేసింది.
గత సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ, ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. జట్టు ఓపెనింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ జోడీ అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్ జట్టుకు ప్రధాన బలం. మిడిల్ ఆర్డర్‌లో రజత్ పాటీదార్, దేవదత్ పడిక్కల్, ఫినిషర్లుగా జితేష్ శర్మ, రోమారియో షెపర్డ్ జట్టుకు బ్యాటింగ్ లో మరింత డెప్త్ అందిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, హేజిల్ వుడ్ కీలకం కానున్నారు. అయితే, హేజిల్ వుడ్ గాయం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవడం జట్టుకు కొంత ప్రతికూల అంశమే.
మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి కప్పు గెలవడమే ధ్యేయంగా బరిలోకి దిగుతోంది. అయితే, పాట్ కమిన్స్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవడంతో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడి మరోసారి విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. హెన్రిచ్ క్లాసెన్ మిడిల్ ఆర్డర్‌లో జట్టుకు వెన్నెముకగా నిలవనున్నారు. బౌలింగ్ లో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, యువ స్పిన్నర్ హర్ష్ దుబే తమ సత్తా చాటాల్సి ఉంది.
రెండు జట్లు కాగితంపై బలంగా కనిపిస్తున్నప్పటికీ, ఆర్సీబీకి బ్యాటింగ్, బౌలింగ్ లో సమతుల్యత ఎక్కువగా ఉంది. ఎస్ఆర్ హెచ్ తన బ్యాటింగ్ పవర్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరులో ఒత్తిడిని ఎవరు సమర్థవంతంగా ఎదుర్కోగలరో వారికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి.
ఫిల్ సాల్ట్
విరాట్ కోహ్లీ
దేవదత్ పడిక్కల్
రజత్ పాటిదార్ (కెప్టెన్)
జితేష్ శర్మ (కీపర్)
టిమ్ డేవిడ్
రొమారియో షెపర్డ్
క్రునాల్ పాండ్యా
భువనేశ్వర్ కుమార్
జాకబ్ డఫీ
మంగేష్ యాదవ్.
అభిషేక్ శర్మ
ట్రావిస్ హెడ్
ఇషాన్ కిషన్ (కీపర్, కెప్టెన్)
నితీష్ కుమార్ రెడ్డి
హెన్రిచ్ క్లాసెన్
అనికేత్ వర్మ
హర్షల్ పటేల్
లియామ్ లివింగ్‌స్టోన్
జీషన్ అన్సారీ
ఇషాన్ మలింగా
జయదేవ్ ఉనద్కద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..